ప్రతీ ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:24 PM
80వ స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని అచ్చంపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్‌గర్ తిరంగా ర్యాలీ బుధవారం నిర్వహించారు.
- అచ్చంపేట పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
అచ్చంపేటటౌన్/ కొల్లాపూర్, ఆ గస్టు 12 (ఆంధ్రజ్యోతి) : 80వ స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని అచ్చంపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్‌గర్ తిరంగా ర్యాలీ బుధవారం నిర్వహించారు. ర్యాలీలో 80 మీటర్ల జాతీయ జెండాను ప్రద ర్శిస్తూ విద్యార్థులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లా డుతూ ప్రపంచ దేశాలకు మన దేశశక్తిని తెలి యజేసి మన ఆర్మీ జవాన్లు పోరాట ఫలితం ఆ పరేషన్ సిందూర్ విజయోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రతీ ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటా లన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, నాయకులు, శ్రీనివాసులు, ధర్మా నాయక్, మంగ్యానాయక్, గోపాల్, రవీందర్, శివ, చందులాల్ పాల్గొన్నారు.
కొల్లాపూర్‌లో ఘనంగా ర్యాలీ
కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో వి ద్యార్థులు, రిటైర్డ్ ఆర్మీజవాన్లు, బీజేపీ నాయకు లు హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహిం చారు. దేశస్వాతంత్య్ర దినోత్సవ అమృత వేడుక ల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పి లుపు మేరకు చేపట్టిన హర్‌ఘర్ తిరంగా కార్య క్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావా లని, ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను సగర్వం గా ఎగురవేయాలని సుధాకర్‌రావు కోరారు. మాజీ సైనికుల సంఘం కొల్లాపూర్ అధ్యక్షుడు బాలస్వామి, కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు తమటం శేఖర్ గౌడ్, సందు రమేష్, శ్రీనివాస్ యాదవ్, శ్రీలక్ష్మి, తిరుమల్, కాడం శ్రీనివాస్, నారాయణ, గడ్డం శేఖర్ యాదవ్, పరశురామ్, మెంటే శివకృష్ణ భరత్ పాల్గొన్నారు.
ఫ కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం లో సింగోటం గ్రామ ఉప సర్పంచ్, బీజేపీ జిల్లా నాయకుడు తమటం సాయికృష్ణ గౌడ్ ఆధ్వ ర్యంలో హర్ ఘర్ తిరంగా పిలుపు కార్యక్ర మాన్ని నిర్వహించారు.