Share News

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:34 PM

దేశ సమైఖ్యత, సమగ్రతను చాటి చెప్పేందుకే ప్రతీ ఇంటికి జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెలి పిలుపునిచ్చారు.

 ప్రతీ ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి
దండేపల్లిలో బైక్‌ ర్యాలీలో రఘనాథ్‌, పార్టీ నేతలు, నాయకులు

బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి

దండేపల్లి ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): దేశ సమైఖ్యత, సమగ్రతను చాటి చెప్పేందుకే ప్రతీ ఇంటికి జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెలి పిలుపునిచ్చారు. 80వ స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని కన్నెపల్లి గూడెం రింగ్‌ రోడ్డు గుండా మ్యాదరిపేట, తాళ్లపేట నుంచి దండేపల్లి, ముత్యంపేట వరకు జాతీయ జెండాలతో హర్‌ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే దేశా నికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. మ్యాదరిపేటలో బ్రిలియంట్‌ ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులు జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ చేపట్టి వారికి మద్దతుతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య, గూడెం పీఏసీఎస్‌ ఛైర్మన్‌ బెడద సురేష్‌, పార్టీ నాయకులు రవిగౌడ్‌, సంతోష్‌, డేగ బాపు, తులసి, లక్ష్మన్‌, సత్తయ్య, హరికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:34 PM