Share News

kumaram bheem asifabad- మదినిండా.. జాతీయ జెండా

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:29 PM

జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం జాతీయ జెండా ఎగురవేశారు. వాడవాడలా జెండా వేడుకలు నిర్వహించారు.

kumaram bheem asifabad-  మదినిండా.. జాతీయ జెండా
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం జాతీయ జెండా ఎగురవేశారు. వాడవాడలా జెండా వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కె హరిత, కోర్టు అవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శారద దేవి, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్‌, పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఈఈ దర్మేందర్‌, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయంలో చైర్మన్‌ అనిల్‌ జెండా ఎగురవేశారు. తహసీల్దార్‌ రీయాజ్‌ ఆలీ, ఎంపీడీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగ, నర్సింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ పద్మలత, డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణలు జాతీయ జెండా ఎగురవేశారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన సింగరేణి జీఎం కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీ రమేష్‌ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌ తిరుపతి, సీఎంవోఎఐ అధ్యక్షుడు ఎం.నరేందర్‌, ఎస్‌ఓటు జీఎం రాజమల్లు, గోలేటి పీవో ఎన్‌.ఉమాకాంత్‌, ఏరియా ఇంజనీర్‌ వీరన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ సూర్య ప్రకాష్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్‌, సీఐ సంజయ్‌, ఎఫ్‌ఆర్వో రమాదేవి, ఏపీఎం దుర్గయ్య తదితరులు జాతీయ జెండా ఎగురవేశారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మువ్వ న్నెల జెండా రెపరెపలాడింది. తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై సర్తాజ్‌పాషా, ఏవో నాగరాజు, ఎంఈవో సునీత, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ స్వపన్‌మండల్‌, కస్తూర్బా పాఠశాల ఎస్‌వో అరుణ, గిరిజన పాఠశాల హెచ్‌ఎం మారుబాయి, వెటర్నరీ డాక్టర్‌ లక్ష్మినారాయణ, డాక్టర్‌ శ్రావణ్‌, సర్పంచ్‌ దుర్గం సరోజ తదితరులు జెండా ఎగురవేశారు. జిల్లా పరిషత్‌ పాఠశాల, జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణ ఆకట్టుకున్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో జెండా ఎగురవేశారు. తహసీల్దార్‌ కవిత, ప్రత్యేక అధికారి ఎన్‌టీ ప్రకాష్‌, ఏవో గోపికాంత్‌, వైద్యాధికా వినయ్‌, ఏపీఎం కోనయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరే పెంటు, సీడీపీవో విజయలక్ష్మి, గ్రంథాలయంలో లైబ్రరియేన్‌ స్వర్ణలత, ప్రిన్సిపాల్‌ తిరుపతి, ఎస్టీవో హబీబ్‌, కేజీబీవీ పాఠశాలలో ఇన్‌చార్జీ ఎస్‌ఓ రైసా ఖాతూన్‌ జెండాలు ఎగురవేశారు. ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నటరాజ్‌, వాంకిడి సర్పంచు సతీష్‌, టీజీబీ వ్యాంకులో మేనేజర్‌ అనిల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, బీజేపీ మండల అధ్యక్షుడు చిదర్ల నరేష్‌, జెండా ఆదిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో పాటిల్‌ జోత్స్న, ఎంపీడీవోఖాజా అజీజుద్దీన్‌, నాయబ్‌ తహసీల్దార్‌ రాంలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ నాగారాజుగౌడ్‌, ఎంపీడీవో రామచందర్‌, ఎంఈవో శ్రీనివాస్‌, ఐకేపీ ఏపీఎం సూర్యాకాంత్‌, కేజీబీవీ ప్రత్యేకాధికారి మీనా, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొని జెండా ఎగురవేశారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో జెండా ఎగురవేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ రాజలింగు ఎంపీడీవో రవిందర్‌, ఎంఈవో కుడ్మేత సుధాకర్‌, ఎస్సై కొమురయ్య, సర్పంచ్‌ ఆత్రం ఓంప్రకాష్‌, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటస్వామి, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి స్వప్న జెండా ఎగురవేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, పార్టీల నాయకులు మాజీ ప్రజాప్రతినధులు జెండా ఎగురవేశారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలో జెండా వేడుకలు ఘనంగా నిర్వహించారు., తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, ఎస్సై రమేష్‌, టీఎస్‌పీఎస్‌లో చైర్మన్‌ పుష్పతి గౌడ్‌, ఎంపీడీవో నసిరుల్లాఖాన్‌, మండల విద్యావనరుల కేంద్రంలో సీహెచ్‌ శ్రీనివాస్‌, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ రాపర్తి జయలక్ష్మి జెండా ఎగురవేశారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): మండలంలో జెండా వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎస్సై అనిల్‌కుమార్‌, ఏఈవో శ్రీవిద్య, కస్తూర్బా విద్యాలయం స్పెషల్‌ అధికారి కవిత జెండా ఎగురవేవారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ నాగర్జునగౌడ్‌, ఎంపీడీవో అంజద్‌ పాషా, వ్యవసాయాధికారి యుగంధర్‌, ఎస్సై శ్రీకాంత్‌ జెండా ఎగురవేశారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ ఉప్పుల ప్రమోద్‌, ఎంపీడీవో కార్యాలయంలో సూపరిటెండెంట్‌ మహేష్‌, ఎస్సై సతీష్‌, ఏఈవో గన్‌ శ్యాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ మాంతయ్య, ఐకేపీలో మండల అధ్యక్షురాలు కుసుమ, ట్రాన్స్‌కో ఏఈ అంజన్‌కుమార్‌, సర్పంచు శంకర్‌, డాక్టర్‌ అంజలి తదిదరులు జెండా ఎగురవేశారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండలంలో జెండా వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో నగేష్‌, ఎస్సై సుబ్బారావు, ఏవో వినయ్‌రెడ్డి, సర్పంచు కొట్నాక రాజేష్‌ జాతీయ జెండాలను ఎగరవేశారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. .మండల కేంద్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.తహసీల్దార్‌ ఆడ భీర్‌షా, ఎంపీడోవో సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాఽథ్‌రావు, జైనూర్‌ సర్పంచ్‌ కోడప ప్రకాష్‌, సహకార సంఘం చైర్మన్‌ కోడప హన్ను పటేల్‌, డీఈ పజిల్‌ హాక్‌, వైద్యాధికారి డాక్టర్‌ అశోక్‌, బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పార్వతి తదితరులు జెండా ఎగురవేశారు.

Updated Date - Aug 15 , 2026 | 11:29 PM