Share News

మూడు నెలల్లో మున్సిపాలిటీ రూపు రేఖలు మార్చేస్తా...

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:25 PM

ప్రజలు సహకరిస్తే లక్షెట్టిపేట మున్సిపాలిటీని మూడు నెలల్లో రూపు రేఖలు మార్చేసి రాష్ట్రంలో ఉత్త మ మున్సిపాలిటీగా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు.

మూడు నెలల్లో మున్సిపాలిటీ రూపు రేఖలు మార్చేస్తా...

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలు సహకరిస్తే లక్షెట్టిపేట మున్సిపాలిటీని మూడు నెలల్లో రూపు రేఖలు మార్చేసి రాష్ట్రంలో ఉత్త మ మున్సిపాలిటీగా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 4,10వ వార్డుల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్షెట్టిపేట పట్టణంలో ఉన్న 15వార్డుల్లో మూడు రోజుల్లో రెండు వార్డుల్లో కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బందితో పా టు సంబంధిత శాఖల సమన్వయం చేసుకుని వార్డులను అందంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ముఖ్యంగా నా లు అంశాలను తీసుకుంటామని అందులో ప్రభుత్వం 200యూనిట్ల ఉచిత కరెంటు రానివారు ఉంటే అధికారులకు తెలియజేయాలని తెల్లరే షన్‌ కార్డు, ఫించన్‌, ఇందిరమ్మ ఇండ్లు రానివారు మున్సిపల్‌ కార్యాల యంలో సంప్రదించి దరకాస్తు చేసుకోవాలన్నారు.

ఫలక్షెట్టిపేట మున్సిపాలిటీలో వచ్చే ఏడాది నిర్వహించనున్న పుష్క రాల సందర్బంగా రోడ్డు వెడెల్పు పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలి పారు. ఊత్కూర్‌ చౌరస్తా నుండి పాత బస్టాండ్‌ తెలంగాణ తల్లి విగ్ర హం వరకు రోడ్డుకు ఇరువైపుల 40ఫీట్ల చొప్పున అంటే 80ఫీట్ల రోడ్డు ను ఏర్పాటు చేస్తామని పాత బస్టాండ్‌ నుంచి గోదావరి వద్దకు రోడ్డు కు ఇరువైపుల 30ఫీట్లు అంటే 60ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు సహకరించి పనుల్లో జాప్యం జరుగకుండా మన్సిపల్‌ అధికారులకు సిబ్బందికి సహకరించాలన్నారు.. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ 30పడకల ఆసుపత్రిలో విద్యార్థినుల కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంత అంజలి నర్స య్య, వైస్‌ చైర్మన్‌ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్‌, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రేమ్‌చంద్‌, వైస్‌ చైర్మన్‌ ఆరీఫ్‌, తహాసీల్దార్‌ దిలీప్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌, వైద్యాధికారి కోటేశ్వర్‌, ఆసుపత్రి సూపరిండెంట్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు చిన్నయ్య, సువర్ణ రమేష్‌, బోడ రాజు, చంద్రమౌళి, పెండెం పద్మరాజన్న, పర్వీన్‌ సుల్తాన ఆరీఫ్‌, బిరుదుల సత్యనారాయణ, గోప సుజాత రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:25 PM