Share News

మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:36 PM

లక్షెట్టిపేట ము న్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. గతంలో ఏళ్ల తరబడి పాలించిన నాయకులు ఈప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు.

మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట ము న్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. గతంలో ఏళ్ల తరబడి పాలించిన నాయకులు ఈప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. ప్రస్థుతం చేపట్టబోయే ప్రతీ పనులను రానున్న రెండు మూడు త రాల వాళ్లు చూసి ఆనందపడేలా ఉండాలన్నదే నాఆకాంక్ష అన్నారు. చేపట్టబోయే పనుల్లో ఒక్కరిద్దరికి నష్టం జరుగు తుందన్న విషయం తనకు తెలుసని కానీ బావితరాల వాళ్లకు ఉపయోగపడే పనులు అన్న విషయం గుర్తు పె ట్టుకుని సహకరించాలన్నారు. ఊత్కూర్‌ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు 80ఫీట్ల మేరకు, పాత బస్టాండ్‌ నుంచిగోదావరి రోడ్డు దానిని 100మీటర్ల వరకు 50ఫీట్లు ఆతర్వాత అవసరం మేరకు గోదావరి నది వరకు వెడ ల్పు చేస్తారని అదే విధంగా ఇటిక్యాల నుండి మహాలక్ష్మి వాడ, అంగడిబసార్‌ రోడ్డను 30ఫీట్లు చేయనున్నట్లు ఎ మ్మెల్యే తెలిపారు. మే 2 తర్వాత అధికారులు పనులు మొదలు పెడతామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంత అంజలి నర్సయ్య, వైస్‌ చైర్మన్‌ రాజేశ్వరి, కౌన్సిలర్లు చిన్నయ్య, తోట సువర్ణరమేష్‌, బోడ రాజు, పర్వీన్‌సుల్తాన, సత్యనారాయణ, సుజాత రమేష్‌తో పాటు కోఆప్షన్‌ సభ్యులు సువర్ణఅశోక్‌, నరసింహాచారి, తైసీన్‌ హాజీ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్‌, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చెల్ల నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 11:36 PM