Share News

అడిగింది కొండంత...ఇచ్చింది గోరంత...!

ABN , Publish Date - Mar 21 , 2026 | 10:39 PM

వ్యవసాయ రం గానికి పెద్దపీట వేస్తున్నామని పదేపదే చెబుతున్న కాంగ్రె స్‌ సర్కారు అందుకు అవసరమైన నీటి ప్రాజెక్టులను మా త్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తు న్నాయి.

అడిగింది కొండంత...ఇచ్చింది గోరంత...!

-బడ్జెట్‌లో ప్రాజెక్టులకు మొండి చేయి

-అరకొర నిధులతో పనులు చేపట్టేదెలా..

-రూ. 2వేల కోట్ల ప్రతిపాదనలకు రూ. 450 కోట్లు కేటాయింపు

-రాళ్లవాగు కరకట్ట మినహా, ఇతర ప్రాజెక్టులకు నామ మాత్రమే

-రూ. 52.62 కోట్లతో ప్రాణహితకు ప్రాణం పోసెదెలా..?

మంచిర్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రం గానికి పెద్దపీట వేస్తున్నామని పదేపదే చెబుతున్న కాంగ్రె స్‌ సర్కారు అందుకు అవసరమైన నీటి ప్రాజెక్టులను మా త్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తు న్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీ సమా వేశాల్లో భాగంగా ఈనెల 20న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మ ల్లు భట్టివిక్రమార్క రూ. 3,24,234 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో వివిధ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించడంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందనే అభిప్రాయాలు వ్య క్తమవుతున్నాయి. బడ్జెట్‌లో రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖకు రూ. 22,615 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించగా, ఉ మ్మడి జిల్లాకు అత్యల్ప కేటాయింపులు చేశారు. రాష్ట్ర ప్ర భుత్వం మానస పుత్రికగా భావించే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క ర్‌ ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు సైతం కంటి తుడుపు ని ధులే కేటాయించడంతో అసలు ప్రాజెక్టు పనులు కొనసాగు తాయా...? లేదా...? అన్న సందేహాలు మెదులుతున్నాయి. ఉ మ్మడి జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నీటి పా రుదలశాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనల ప్ర కారం సుమారు రెండు వేల కోట్ల పై చిలుకు బడ్జెట్‌ అవ సరం ఉండగా, అందులో పావలా వంతు కూడా కేటాయిం చకపోవడంతో వాటి మనుగడ కష్టసాధ్యమన్న ప్రశ్నలు ఉ త్పన్నమవుతున్నాయి.

రూ. 442 కోట్లు కేటాయింపు....

నీటిపారుదలశాఖ మంచిర్యాల, ఆదిలాబాద్‌ చీఫ్‌ ఇం జనీర్ల (సీఈ)ల పరిధిలోని ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాజె క్టులకు బడ్జెట్‌లో రూ. 441.22 కోట్లు కేటాయించారు. ఆయా ప్రాజెక్టుల అవసరాన్ని బట్టి అధికారులు మొత్తం రూ. 2వేల పై చిలుకు బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు పంపగా అత్యల్ప ంగా నిధులు కేటాయించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నా యి. మంచిర్యాల సీఈ పరిధిలో కేవలం జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కరకట్టల నిర్మాణం కోసం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించగా, ఆదిలాబాద్‌ సీఈ పరిధిలోని చ నాఖా-కొరాటా ప్రాజెక్టుకు సైతం అధికంగా నిధులు కేటా యించారు. అలాగే వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టుకు సైతం ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయిం చడం గమనార్హం. ఇవి మినహా ఇద్దరు సీఈవోల పరిధిలోని మొత్తం 14 ప్రాజెక్టుల్లో పై రెండు మినహా ఇతర 12 ప్రా జెక్టులకు అరకొర నిధుల కేటాయింపుతో సరిపెట్టారు.

ప్రాణహితకు ప్రాణం పోసేనా..?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు కేటా యించిన రూ. 52.62 కోట్లతో పనుల కొనసాగింపుపై సం దేహాలు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచి ర్యా ల, ఆసిఫాబాద్‌ జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ హయాంలో నిర్మించదలచిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సుజల స్ర వంతి ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి మంచి రోజులు రానున్నాయనే ఆనందంలో రైతులు ఉన్నా రు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2 లక్షల పై చిలుకు ఎ కరాల ఆయకట్టుకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద రూపకల్పన జరిగింది. రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో 160 టీఎంసీ ల సామర్థ్యంతో 2008లో అప్పటి ప్రభుత్వం పథకా నికి శ్రీకారం చుట్టింది. పనులకు అప్పటి ముఖ్యమం త్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంఖుస్థాపన చేశారు. పను లను 28 ప్యాకేజీలుగా విభజించి వివిధ కాంట్రా క్టిం గ్‌ కంపెనీలకు అప్పగించారు. వందల కోట్లతో చేప ట్టిన పనులను గుత్తేదార్లు అర్థాంతరంగా వదిలివే శా రు. 71 కిలో మీటర్లమేర కాలువలు నిర్మించాల్సి ఉం డగా పనులను మధ్యలో నిలిచిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రాజెక్టుకు పునరు జ్జీవనం పోయాలంటే ప్రస్తుతానికి రూ. 1068 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో కేవలం రూ. 52.62 కోట్ల బడ్జెట్‌ కేటాయిం చడంతో ప్రాజెక్టు పునరుజ్జీవంపై సందేహాలు నెలకొన్నాయి.

కరకట్టల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌...

జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కారణంగా ప్రతి యే టా వర్షాకాలంలో ఏడెనిమిది కాలనీలు నీట మును గుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి పట్టణాన్ని కాపా డేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రతి ష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రాజెక్టు పురుడు పోసు కుంది. రాళ్లవాగు వెంట మొత్తం 7.1 కిలోమీటర్ల పొ డవుతో చేపట్టనున్న కరకట్టల నిర్మాణానికి రూ. 255.59 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్ర తిపాధించారు. మొన్నటి బడ్జెట్‌ అందులో నుంచి రూ. 115.84 కోట్లు కేటాయించడంతో పనుల్లో వేగం పుంజుకోనుంది. మిగతా మొత్తం ఇతరత్రా పనులకు సంబం ఽధించిన నిధులు మళ్లించే అవకాశం ఉండ టంతో 2027 వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసేం దుకు వెసులుబాటు లభించినట్లయింది.

నిధులు కేటాయింపు ఇలా....

మంచిర్యాల సీఈ పరిధిలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి అధికారులు తయారు చేసిన ప్రతిపాధనలు, నిధుల కేటాయింపు ఇలా ఉంది.

ప్రాజెక్టు అవసరమైన నిధులు కేటాయించిన నిధులు

రాళ్లవాగు కరకట్ట రూ. 255.59 కోట్లు రూ.115.84 కోట్లు

గొల్లవాగు రూ. 2.20 కోట్లు రూ. 0.11 కోట్లు

నీల్వాయి రూ. 6.10 కోట్లు రూ. 6.10 కోట్లు

వట్టివాగు రూ. 34.71 కోట్లు రూ. 3.17కోట్లు

కుమరంభీం రూ. 89.07 కోట్లు రూ. 15.32 కోట్లు

పీపీ రావు రూ. 4.37 కోట్లు రూ. 0.60 కోట్లు

జగన్నాథ్‌పూర్‌ రూ. 10.70 కోట్లు రూ. 7.50 కోట్లు

ప్రాణహిత రూ. 1068.93 కోట్లు రూ. 52.62 కోట్లు

ఆదిలాబాద్‌ సీఈ పరిధిలో....

ఆదిలాబాద్‌ సీఈ పరిధిలో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల పరిధిలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి నిధుల కేటాయింపు ఇలా ఉంది.

ప్రాజెక్టు కేటాయించిన నిధులు (రూ. కోట్లలో)

చనాఖా-కోర్ట రూ. 177.54

కడెం రూ. 3.78

సాత్నాల రూ. 1.00

మత్తడివాగు రూ. 4.62

గడ్డెన్నవాగు రూ. 1.52

చిక్మన్‌వాగు రూ. 1.81

త్రివేణి సంగమం రూ. 1.78

Updated Date - Mar 21 , 2026 | 10:39 PM