Share News

ఉదయసముద్రం నీటి నిరీక్షణకు తెర

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:32 AM

సాగునీటి వనరుల కోసం ఇబ్బందులు పడుతూ ఉదయసముద్రం ప్రాజెక్టు నీటి కోసం చిట్యాల మండలంలోని తాళ్ళవెల్లంల రైతులతో పాటు సుమారు 28గ్రామాల రైతుల పదేళ్ల నిరీక్షణకు తెరపడనుందని నీటిపారుదలశాఖ రిటైర్డ్‌ ఈఈ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఉదయసముద్రం నీటి నిరీక్షణకు తెర
సర్వేలో పాల్గొన్న నీటిపారుదలశాఖ రిటైర్డ్‌ ఇంజనీర్‌ శ్యాంప్రసాద్‌రెడ్డి

నీటిపారుదలశాల రిటైర్డ్‌ ఈఈ శ్యాంప్రసాద్‌రెడ్డి

చిట్యాలరూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): సాగునీటి వనరుల కోసం ఇబ్బందులు పడుతూ ఉదయసముద్రం ప్రాజెక్టు నీటి కోసం చిట్యాల మండలంలోని తాళ్ళవెల్లంల రైతులతో పాటు సుమారు 28గ్రామాల రైతుల పదేళ్ల నిరీక్షణకు తెరపడనుందని నీటిపారుదలశాఖ రిటైర్డ్‌ ఈఈ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. బ్రాహ్మణవెల్లెంల ఉదయస ముద్రం కాల్వ కిష్టాపురం చెరువులోకి పొడిగింపులో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల రెవెన్యూ గ్రామం వేంబావి శివారులో గురువారం లిఫ్ట్‌ పథకానికి చెందిన కిష్టాపూర్‌ లింక్‌ కెనాల్‌ మార్కింగ్‌ కోసం సర్వే ప్రారంభించారు. వేంబావి శివారులో 500మీటర్ల పరిధి కాల్వ సర్వేలో భూములు కోల్పోతున్న రైతులతో నీటి పారుదలశాఖ ఇంజనీర్లు మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతులకు సత్వరం నష్టపరిహారాన్ని ఇప్పించి కాల్వ పనులను త్వరితగతిన పూర్తిచేసి నీరందించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ భూగర్భజలాల మట్టం తగ్గడంతో సాగునీటి వనరులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సమీపంలోనే ఉన్న బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు నీళ్ళు వచ్చినట్లయితే కష్టాలు తీరుతాయని రైతులు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. కాలువ పనుల కోసం సర్వే ప్రారంభమైందని, రైతుల కష్టాలు తీరనున్నాయని పదేళ్ళ నిరీక్షణకు ఇక తెరపడినట్లేనన్నారు. సర్వేలో రిటైర్డ్‌ ఈఈ కరుణాకర్‌రెడ్డి, డీఈ రమేష్‌, ఈఈ సతీష్‌చంద్రయాదవ్‌, డీఈ విఠలేశ్వర్‌, ఏఈ ఎం. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:32 AM