Share News

నిరుపేదల కల..నెరవేరే వేళ

ABN , Publish Date - Sep 07 , 2026 | 10:41 PM

సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఆ కల నెరవేరే సమయం ఆస న్నమైంది. బీఆర్‌ఎస్‌ హాయంలో నిర్మించిన డబుల్‌ బె డ్‌రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చే స్తోంది.

నిరుపేదల కల..నెరవేరే వేళ

చివరి దశకు ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ...!

-జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు 1,028 ఇళ్లు మంజూరు

-బెల్లంపల్లి, మందమర్రిలో పూర్తయిన పంపిణీ ప్రక్రియ

-మంచిర్యాలలో మిగిలి ఉన్న మరో 60 ఇళ్లు

-వారం రోజుల్లో లబ్ధిదారులకు అందజేసేందుకు సన్నాహాలు

మంచిర్యాల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఆ కల నెరవేరే సమయం ఆస న్నమైంది. బీఆర్‌ఎస్‌ హాయంలో నిర్మించిన డబుల్‌ బె డ్‌రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చే స్తోంది. గత ప్రభుత్వ హయాంలో గూడు లేని పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్న హామీ ఏళ్లు గడు స్తున్నా నెరవేరకపోగా, నిరుపేదలకు పంపిణీ చేసేందు కు నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు కూడా పంపిణీకి నోచుకోలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల కోట్లు వె చ్చించి నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం వృధాగా పడి ఉన్నా యి. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడంతోపాటు బీ ఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన ఇళ్ల పంపిణీకి పూను కోవడంతో లబ్ధిదారుల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి.

1028 ఇళ్ల పంపిణీ...

జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియో జక వర్గాల పరిధిలో మొత్తం 1656 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో అర్హులైన లబ్ధిదారు లకు అందజేసేందుకు మొత్తం 1028 ఇళ్లు అవసరం కా గా, పంపిణీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మం చిర్యాల నియోజకవర్గంలో 360, బెల్లంపల్లి నియోజక వర్గంలో 108, చెన్నూరు నియోజకవర్గంలోని మందమ ర్రిలో 560 ఇళ్లు మంజూరు చేశారు. బెల్లంపల్లి, మంద మర్రికి సంబంధించి లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే పూ ర్తికాగా, మంచిర్యాలలో మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హ యాంలోనే 300 ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మరో 60 ఇళ్లను అందజేయాల్సి ఉండగా, కాంగ్రెస్‌ ప్ర భుత్వం పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డబుల్‌ బె డ్రూం ఇళ్ల కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కొక్కదానికి రూ. 5.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించింది. మంచిర్యాల జిల్లాకు సంబం ధించి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అవసరమైన ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ఇన్నాళ్లు ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక...

రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపునకు సం బంధించి మంచిర్యాల నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. మొదటి విడుతలో భా గంగా జిల్లా కేంధ్రంలో నిర్మాణం పూర్తయిన 360 గృహా లను అర్హులకు కేటాయించేందుకు అధికారులు ప్రాథ మిక విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా మీ -సేవ ద్వారా అందిన 2,958 ధరఖాస్తులను పరిశీలిం చిన అధికారులు వార్డుల వారీగా 1621 మందిని అర్హు లుగా గుర్తించి, వారి జాబితాను 2022 ఆగస్టు 29న మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రచురించారు. ఆక్షేపణల అనంతరం పంపిణీ చేయనున్న 360 ఇళ్లకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక కూడా ఇదివరకే పూ ర్తయింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2023లో సం క్రాంతి పండుగకు అర్హులైన లబ్దిదారులకు డబుల్‌ బె డ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ పూ ర్తిస్థాయిలో పంపిణీ జరుగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ర్పడ్డ తరువాత ఇందిరమ్మ సొంతింటి పథకాన్ని ప్రారం భించింది. పథకంలో భాగంగా కోట్లు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసుకుని వృథాగా పడి ఉన్న డబుల్‌ బెడ్రూం ఇ ళ్లను కూడా అర్హతగల లబ్ధిదారులకు అందజేయాలని రేవంత్‌ ప్రభుత్వం నిర్ణయింది. ప్రభుత్వ ఆదేశాలతో డ బుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధ్దిదారుల జాబితాను బయటకు తీసిన అధికారులు పంపిణీకి రంగం సిద్ధం చేశారు.

వారంలో రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియ...

మంచిర్యాల నియోజక వర్గంలో మరో 60 ఇళ్లు లబ్ధ్దిదారులకు పంపిణీ చేస్తే జిల్లాలో వందశాతం లక్ష్యం నెరవేరినట్లవుతుంది. వాటికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం మిగిలి న ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉండటంతో లబ్ధ్దిదారులకు అందజేసేందుకు హౌజింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ నేతృత్వంలో వారం రోజుల్లో లక్కీ డ్రా నిర్వహిం చడం ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయిలో ఇళ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కానున్నట్లు హౌజింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బన్సీలాల్‌ ’ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Sep 07 , 2026 | 10:42 PM