kumaram bheem asifabad- ఎమ్మెల్సీ బహిరంగ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:54 PM
స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ తాత మధు బహిరంగ క్షమాపణ చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ తాతామధు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ తాత మధు బహిరంగ క్షమాపణ చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ తాతామధు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం కించపరిచేలా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తాతామధు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. తాతామధు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనను బర్తరఫ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపర్తి మురళీ, డీసీసీ ఉపాధ్యక్షులు తారీక్, భీంరావు, నాయకులు వినోద్, రవి, జక్కయ్య, విశ్వనాథ్, మారుతి, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తు స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్ మాట్లాడుతూ స్పీకర్‌ను ఎమ్మెల్సీలు దుర్భాషలాడడం హేయమైన చర్య అన్నారు. స్పీకర్‌కు క్షమాపణ చేపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, డీసీసీ కార్యవర్గ సభ్యుడు సుద్దాల శ్రీనివాస్, నాయకులు టేకం అంబారావు, ఆత్రం భీర్ష, పెందోర్ రాము తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ఫై అనుచిత వ్యాఖ్యాలు చేసిన ఎమ్మెల్సీ మధు తన పదవీకి వెంటనే రాజీనామ చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు డిమాండు చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్పీకర్‌పై అనుచిత వాఖ్యాలు చేయటం దారుణమన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి రాజ్యంగం బద్దమైన పదవీలో ఉన్నారనే కారణంతో ఇష్టారాజ్యంగా ఎమ్మెల్సీ మాట్లాడినట్టు పేర్కొన్నారు. వెంటనే తన పదవీకి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి ప్రభాకర్, దుర్గం రాజేష్, నర్సింగరావు, అజ్మీర గోపి, ఈశ్వర్, రాజేష్, శ్రీనివాస్, క్రాంతికుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ మధును వెంటనే భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండు చేశారు. మంగళవారం పెంచికల్‌పేటలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సముద్రాల రాజన్న మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యాలు చేసిన ఎమ్మెల్సీపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ ఉస్మాన్, శ్రీనివాస్, చంద్రమైళి, భుజంగరావు, సుధాకర్, రాచకొండ కృష్ణ, సదాశివ్, శంకర్ గౌడ్, భాస్కర్‌గౌడ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యాలు చేసిన ఎమ్మెల్సీ మధు వైఖరికి నిరసనగా కౌటాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఎమ్మెల్సీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యాలు చేసిన ఎమ్మెల్సీపై వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. అలాగే క్రిమినల్ కేసు నమోదు చేసి భర్తరఫ్ చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ మధు అనుచిత వ్యాఖ్యాలు చేసినందులకు మంగళవారం కెరమెరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్, ఇందిర ఫెలో షిప్ జిల్లా అధ్యక్ష/రాలు కోవ ఇందిర మాట్లాడుతూ దళితుల ఆత్మ గౌరవారన్ని కించపరిచి ఎమ్మెల్సీపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్మెర శ్రీకాంత్, మాజీ మార్కెట్ కమిటి వైస్ ఛైర్మన్ మోహర్లే బాపురావు, ఆత్మ కమిటీ సభ్యులు గోగర్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు