Share News

22ఏ జీవో తప్పిదాలపై మంత్రి రాజీనామా చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:25 PM

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22ఏ నిషేదిత భూముల జాబితలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచా రణ జరిపించాలని, ఇందుకు బాద్యుతగా మంత్రి శ్రీనివాసరెడ్డి రాజీనామా చే యాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

22ఏ జీవో తప్పిదాలపై మంత్రి రాజీనామా చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలు

కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నేతల ఆందోళన

నస్పూర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22ఏ నిషేదిత భూముల జాబితలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచా రణ జరిపించాలని, ఇందుకు బాద్యుతగా మంత్రి శ్రీనివాసరెడ్డి రాజీనామా చే యాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి, జిల్లా అఽధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌లు పలువురు నాయకులతో 22ఏ జీవో పై వినతి పత్రం ఇవ్వడానికి శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌కు వచ్చారు. లోపలికి అందరికి అనుమతి లేదని, కొందరు మాత్రమే వెళ్లాలని పోలీసులు చెప్పడంతో నా యకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను అధికారుల దృ ష్టికి తీసుకెళ్లాలని వస్తున్నామని, ఎం దుకు లోపలికి వెళ్లవద్దని రఘునాథ్‌ పోలీసులను ప్రశ్నించారు. దీంతో బీజేపీ నాయకులు కలెక్టరేట్‌ ద్వారం గేటు ఎదుట నిరసనకు దిగి వినతి పత్రాన్ని గేటుకు కట్టారు. అనంతరం రఘునాథ్‌ వెరబెల్లి, వెంకటేశ్వర్‌ గౌడ్‌లు మాట్లాడుతూ శాంతి యు తంగా కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వ డానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీ జేపీ నాయకులు ఎనగందుల కృష్ణ మూర్తి, పురుషోత్తం, వెంకట కృష్ణ, కమాలాకర్‌రావు, సత్రం రమేష్‌, వెం కటేశ్వర్‌రావు, బొట్ల సత్యం, రఘు నందన్‌, రాజ్‌కుమార్‌, సాయి కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:25 PM