కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:28 PM
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముం దు ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18 వేలకు పెంచి ఉద్యోగభద్రత కల్పించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ డి మాండ్ చేశారు.
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఆశా వర్కర్లు
నాగర్కర్నూల్ టౌన్, నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముం దు ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18 వేలకు పెంచి ఉద్యోగభద్రత కల్పించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ డి మాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం ముట్టడించి ధర్నా చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఏళ్లుగా చాలీచాలని జీతాలతో గర్భిణులకు సేవ లు అందిస్తున్నారని అన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచడంతో పాటు పనిభారం త గ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షు డు వర్థం పర్వతాలు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.గీ త, నాయకులు రామయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు జయమ్మ, సువ ర్ణ, పార్వతి, షమీం, విజ య, నిర్మల, మానస, బాల మణి, నర్మద, కృష్ణవేణి, భా గ్యలక్ష్మి, వెంకటమ్మ, మాణిక్య మ్మ, సులోచన పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతా ల్లో 30 ఏళ్లకుపైగా వైద్య సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం కనీసవేతనం అమలు చే యడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. ఆంజనేయులు తెలిపారు. కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆనంద్ కుమార్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అం దజేశారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడు తూ ఈ నెలాఖరులోగా నెలకు రూ.18వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హెల్త్ కార్డులు కల్పించాలని కోరారు. సమస్యలను పరి ష్కరించకపోతే డిసెంబరు 10 నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చ రించారు. కార్యక్రమంలో స్వప్న, యాదమ్మ, వలియా, సువర్ణ, వసంత తదితరులు పాల్గొన్నారు.