kumaram bheem asifabad- వానొస్తే వణుకే..
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:20 PM
కాగజ్‌నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో వర్షం పడితే వణుకు పడుతోంది. దీంతో రాత్రి పూట జాగరణ తప్పడం లేదు. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి ఇంటి సామగ్రి మొత్తం తడిసి పోతోందని ఆవేదన చెందుతున్నారు. ఏటా వర్షాలకు వరద నీరు రోడ్లపైకి వస్తోంది. ఆ వరద నీరంతా ఇళ్ల్లలోకి రావడంతో పట్టణంలోని సంజీవయ్య కాలనీ వాసుల కష్టాలు వర్ణనాతీతం.
- ఇళ్లలోకి చేరడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు
కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో వర్షం పడితే వణుకు పడుతోంది. దీంతో రాత్రి పూట జాగరణ తప్పడం లేదు. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి ఇంటి సామగ్రి మొత్తం తడిసి పోతోందని ఆవేదన చెందుతున్నారు. ఏటా వర్షాలకు వరద నీరు రోడ్లపైకి వస్తోంది. ఆ వరద నీరంతా ఇళ్ల్లలోకి రావడంతో పట్టణంలోని సంజీవయ్య కాలనీ వాసుల కష్టాలు వర్ణనాతీతం. అలాగే సర్‌సిల్క్ కాలనీ, బాలాజీ నగర్, సి.బాబు కాలనీ, నౌగాం బస్తీ, శ్రీనగర్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షం పడితే చాలు వణికిపోతున్నారు. ప్రధాన రోడ్లపై నుంచి వరదనీరు పారుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బం దులు తలెత్తి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందంటు న్నారు. వర్షం నీరుతో సహా కాలువలు పొంగి మురికి నీరు పోటెత్తుతోంది. వర్షాకాలంలో ప్రతీ యేట మురికి నీరంతా ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- కబ్జాలను తొలగిస్తేనే..
గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి సంజీవయ్య కాలనీ సమీపంలోని ఒర్రె నీరంతా కాలనీలోకి, ఇళ్లలోకి చేరి తిరిగి బయటికి రోడ్ల మీద ప్రవహిస్తోంది. రాత్రి వేళ ఒక్కసారిగా వర్షం వచ్చిం దంటే చాలు పక్కనే ఉన్న నాలా నీరు ప్రవాహంలా ఇళ్లను ముంచెత్తుతోంది. కాలనీ సమీపంలోని ఒర్రెపై కల్వర్టు వరద నీటికి సరిపోకపోవడంతో పాటు, నాలా పక్కనే కబ్జాకు గురైయింది. దీంతో గత నాలుగైదే ళ్లుగా ఇబ్బందిరమైన పరిస్థితి ఎక్కువగా మారింది. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరు కాలువలో ప్రవహిస్తూ కల్వర్టు వద్దకు చేరేసరికి ఇరుకుగా మారింది. దీంతో కాలనీలోకి వరద పోటెత్తి భయం భయంగా గడపాల్సిన పరిస్థితి. అలాగే ఆయా కాలనీల్లో కూడా మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో పాటు, కొన్ని కబ్జాలకు గురయ్యాయి. వరద నీరు, మురికి నీరు రోడ్లపైకి చేరి రోజుల తరబడి బురదతో ఉండడం వలన వాహన దారు లకు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వరద నీటితో జలమయంగా మారుతున్నాయి. దీంతో పలు కాలనీల్లో మోకాళ్ల లోతు వరద నీటిలో కష్టాలు పడాల్సి వస్తోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- నిఽధులు మంజూరవుతున్నా..
నిధులు మంజూరవుతున్నా కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదు. గత ఏడాది ఈ సమస్యను పరిష్కరించేందుకు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పినా కూడా ఇంత వరకు కాలేదు. వర్షాకాలం ప్రారంభం అయ్యే వరకు పనులు చేయకపోవడంతో మార్పు రాలేదు. నాళా వెడల్పు పనులు చేపట్టి చర్యలు తీసుకుంటే కాలనీకి వరద ముప్పు తప్పుతుం దని కాలనీవాసులు చెబుతున్నారు. కాగా వాన పడితే చాలు పక్కనే ఉన్న నాళాలోని మురుగు నీరంతా ఇండ్లలోకి వస్తోంది. ఇండ్ల వెనుకాల భాగంలో ఉన్న నాలా ప్రాంతంలో కబ్జాలు కావడంతో ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో ఇళ్ల వెనుక వైపు నుంచి ముందుకు వరద నీరు పొంగి పొర్లుతుంటే నీటిని తొలగించుకుంటున్నామని కాలనీవాసులు ఆవే దన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.