Share News

kumaram bheem asifabad-భోజనంలో మెనూ పాటించాలి

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:06 PM

విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ తప్పక పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను కలెక్టర్‌ కె హరిత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని స్టోర్‌ గది, మరుగుదొడ్లు, భోజన సదుపాయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ హరిత విద్యార్థులతో మాట్లాడారు

kumaram bheem asifabad-భోజనంలో మెనూ పాటించాలి
ఆశ్రమోన్నత పాఠశాలలో భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

జైనూర్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ తప్పక పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను కలెక్టర్‌ కె హరిత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని స్టోర్‌ గది, మరుగుదొడ్లు, భోజన సదుపాయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ హరిత విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజన సదుపాయం కల్పిస్తున్నారా, ఉపాధ్యాయులు సమయానుకూలంగా పాఠశాలకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం కలెక్టర్‌ మాట్లాడుతు పదో పరీక్షలో విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని సూచించారు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని చెప్పారు. కలెక్టర్‌ తనిఖీ సందర్భంగా పాఠశాల హెచం లేక పోవడంతో ఎక్కడికి వెళ్లారని ఆరా తీశారు. ఆమె కుమారుడి ఆరోగ్యం బాగా లేనందున ఆసుపత్రికి వెళ్లారని ఉపాధ్యాయులు సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని చెప్పారు. విద్యార్థులు కష్ట పడి చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

Updated Date - Apr 03 , 2026 | 11:06 PM