Share News

మెనూ కచ్చితంగా అమలు చేయాలి

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:11 PM

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ర్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం మం డల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మ ధ్యాహ్న భోజనం అమలు, పరిసరాలను పరిశీలించారు.

 మెనూ కచ్చితంగా అమలు చేయాలి
జైపూర్‌ కేజీబీవీలో వంట గదిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మెనూ కచ్చితంగా అమలు చేయాలి

జైపూర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ర్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం మం డల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మ ధ్యాహ్న భోజనం అమలు, పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన తాగు నీరు, విద్యుత్‌, బాల బాలికలకు వేరు వేరుగా మూత్రశాలలు, ప్రహారీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెను ప్రకారం పౌష్టికాహారం అం దించాలన్నారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయా లని, ప్రగతిలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నా రు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పిం చారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌వో ఫణిబాల పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:11 PM