Share News

మెనూ ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:54 AM

తంగళ్లపల్లి, జూన్‌ 22 (ఆంఽధ్రజ్యోతి): మనూ ప్రకారం విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సోమవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల విద్యాలయాన్ని అకస్మిక తనిఖీ చేశారు. విద్యార్ధులు భోజనం చేస్తుండగా వారి వద్దకు వెళ్లి భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెనూ పాటిస్తున్నారా అని ఆరా తీశారు. మోనూ చార్ట్‌ పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిచెన్‌ గోదాంలో బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఎంత మంది విద్యార్ధులు ఉన్నారని ఆరా తీశారు. అనం తరం వసతి గదులను, టాయిలెట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్ధులకు మోనూ ప్రకారం నాణ్యమైన భోజ నం అందించాలని ఆదేశించారు. విద్యార్ధులందరూ తరగతులకు హజర య్యేలా చూడాలని సూచించారు. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

  మెనూ ప్రకారం భోజనం అందించాలి
భోజనం గురించి తెలుసుకుంటున్న కలెక్టర్‌

Updated Date - Jun 23 , 2026 | 12:54 AM