Share News

kumaram bheem asifabad- భోజనంలో మెనూ పాటించాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 10:23 PM

విద్యర్థులకు అందించే భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కెరమెరి మండలం పెద్దపట్నాపూర్‌ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టిక, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. అ

kumaram bheem asifabad- భోజనంలో మెనూ పాటించాలి
పెద్దపట్నాపూర్‌ గిరిజన సంక్షేమ పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె హరిత

కెరమెరి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విద్యర్థులకు అందించే భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కెరమెరి మండలం పెద్దపట్నాపూర్‌ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టిక, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సులభ రీతిలో బోధించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో డ్రాప్‌ అవుట్‌ విద్యార్థులను గుర్తించి సోమవారంలోగా పాఠశాలల్లో ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంబంఽధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 10:23 PM