మేయర్ పీఠం బీసీలదే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:19 PM
నూత నంగా ఏర్పడ్డ మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీలనే వరించనుంది. ప్రభుత్వం వి డుదల చేసిన ప్రకారం కార్పొరేషన్‌ను బీసీ జనర ల్‌కు కేటాయించారు. దీంతో తొలి మేయర్ పీఠంపై బీసీలు జెండా ఎగుర వేయనున్నారు.
ఖరారైన మున్సిపల్ రిజర్వేషన్లు...
-డ్రా పద్ధతిన కేటాయించిన అధికారులు
-మునిసిపల్ ఎన్నికలకు మరో అడుగు ముందుకు
-ఎన్నికలకు సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
మంచిర్యాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నూత నంగా ఏర్పడ్డ మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీలనే వరించనుంది. ప్రభుత్వం వి డుదల చేసిన ప్రకారం కార్పొరేషన్‌ను బీసీ జనర ల్‌కు కేటాయించారు. దీంతో తొలి మేయర్ పీఠంపై బీసీలు జెండా ఎగుర వేయనున్నారు. శనివారం మునిసిపల్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో మునిసిపల్ ఎన్నికలకు మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల తుది జాబితాలు విడు దల కాగా, తాజాగా వార్డుల వారీ రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. వార్డులతోపాటు మునిసి పాలి టీల వారీగా మేయర్, చైర్మన్ అభ్యర్థుల రిజర్వేషన్లు సైతం విడుదల అయ్యాయి. జిల్లాలోని అన్ని మునిసి పాలిటీలలో వార్డుల వారీ రిజర్వేషన్‌లను కలెక్టర్, ఎ న్నికల అధికారి కుమార్ దీపక్ నేతృత్వంలో శనివా రం కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిన కేటాయించారు. ఇక పా ర్టీల వారీగా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెలు వడాల్సి ఉండగా, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నే తలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరు లోగా అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి కానుండగా, రా ష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటిఫి కేషన్ విడుదల చేయడమే మిగిలి ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఈ నెల చివరి వరకు వచ్చే అవకాశాలు ఉండగా, ఫిబ్ర వరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ సీ సన్నద్ధం అవుతు న్నట్లు తెలుస్తోంది. వార్డుల వారీ గా రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పార్టీల సమాయత్తం....
మునిసిపల్ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీలు సైతం సమాయత్తం అవుతున్నాయి. అధికార కాంగ్రెస్ తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ, తదితర పార్టీలు సైతం ఈ విషయమై కసరత్తు మొదలు పెట్టాయి. మొన్నటి పార్లమెం టు ఎన్నికల్లో పట్టణ ఓట్లు పెరగడంతో పట్టుకోసం ఆయా పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్ పల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి మునిసిపల్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు ఆయా పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మునిసిపాలిటీలను గెలుచుకోవడం త ప్పనిసరికాగా, బల్దియాల్లో పట్టుకోసం బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే మంచిర్యాల, చె న్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎ మ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానం ద, గడ్డం వినోద్‌లు సైతం మునిసిపోల్స్‌పై ప్రత్యేక దృ ష్టి కనబరిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా యి. మునిసిపల్ ఎన్నికలను ప్రజలు వ్యక్తిగతంగా ప రిగణించే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల నేతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోనున్నారు.
బరిలో హేమాహేమీలు...
మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పడ్డ తరువాత మొదటి సారి ఎన్నికలు జరగనుండడంతో ఆశావహులు మేయర్ పదవి దక్కించుకోవాలనే ఉత్సా హంతో ఉన్నారు. తాజాగా బీసీలకే మేయర్ పీఠం రిజర్వ్ కావడంతో ఎ వరి ప్రయత్నాలు వారు మొదలుపెడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో బీసీలకు మొత్తం 20 సీట్లను రిజర్వ్ చేయగా, మేయర్ పదవి అధికార కాంగ్రెస్ పార్టీ వశమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో ము నిసిపాలిటీగా ఉన్న సమయంలో చైర్మన్ పీఠాన్ని దాదాపుగా బీసీలే కైవసం చేసుకోగా, ప్రస్తుత ఎన్నికల్లో మేయర్ రేస్‌లో హేమాహేమీలు బరిలో నిలవనున్నారు.
మునిసిపాలిటీల వారీగా ఇలా....
మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ జనరల్ విభా గానికి రిజర్వు అయింది. బెల్లంపల్లి మునిసిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా, లక్షెట్టిపేట చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు, క్యా తన్‌పల్లి చైర్మన్ పదవిని జనరల్ మహిళకు, చెన్నూరు చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్‌లకు గాను ఎస్టీ -01, ఎస్సీ-09, బీసీ-20, అన్‌రిజర్వ్ -30 సీట్లు కే టాయించారు. బెల్లంపల్లి మునిసిపాలిటీలో 34 వార్డులకు గాను ఎస్టీ-01, ఎస్సీ-10, బీసీ-06, అన్‌రిజర్వ్-17 కేటాయించగా, క్యాతన్‌పల్లిలో 22 వార్డుల కు గాను ఎస్టీ-01, ఎస్సీ-07, బీసీ-03, అన్‌రిజర్వ్-11, చెన్నూరులో 18 వా ర్డులకు గాను ఎస్టీ-01, ఎస్సీ-03, బీసీ-05, అన్‌రిజర్వ్-09, లక్షెట్టిపేటలో 15 వార్డులకుగాను ఎస్టీ-01, ఎస్సీ-03, బీసీ-03, అన్‌రిజర్వ్-08 స్థానాలను కేటాయించారు.
కార్పొరేషన్‌లో డివిజన్‌ల
వారీగా రిజర్వేషన్లు...
1 వార్డు. జనరల్ మహిళ, 2.ఎస్సీ మహిళ, 3. జనరల్ మహిళ, 4. ఎస్సీ జనరల్, 5. ఎస్సీ మహి ళ, 6. ఎస్సీ మహిళ, 7. జనరల్, 8. ఎస్సీ జనరల్, 9. ఎస్సీ మహిళ, 10. జనరల్, 11. ఎస్సీ జనర ల్, 12. బీసీ జన రల్, 13. ఎస్సీ జనరల్, 14. బీసీ జనరల్, 15. బీసీ జనరల్, 16. జనరల్, 17. బీసీ జనరల్, 18. బీసీ మహిళ, 19. ఎస్టీ జనరల్, 20. జనరల్, 21. జనరల్, 22. బీసీ మహిళ, 23. బీసీ జనరల్, 24. జనరల్ మహిళ, 25. జనరల్ మహిళ, 26. జనరల్, 27. జనరల్ మహిళ, 28. జనరల్, 29. జనరల్, 30. ఎస్సీ జనరల్, 31. జనరల్, 32. బీసీ జనరల్, 33. బీసీ జనరల్, 34. జనరల్, 35. జనరల్ మహిళ, 36. బీసీ మహిళ, 37. జన రల్, 38. జనరల్ మహిళ, 39. బీసీ మహిళ, 40. జనరల్ మహిళ, 41. జనరల్ మహిళ, 42. జనరల్ మహిళ, 43. జనరల్ మహిళ, 44. బీసీ జనరల్, 45. బీసీ మహిళ, 46. బీసీ మహిళ, 47. జనరల్, 48. జనరల్ మహిళ, 49. జనరల్, 50.బీసీ మహిళ, 51. జనరల్ మహిళ, 52. జనరల్ మహిళ, 53.బీసీ మహిళ, 54. జనరల్ మహిళ, 55. బీసీ మహిళ, 56. బీసీ జనరల్, 57. బీసీ జనరల్, 58. జనరల్ మహిళ, 59. జనరల్, 60. బీసీ మహిళ.