Share News

kumaram bheem asifabad-లెక్క తేలింది

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:13 PM

సర్‌ ప్రక్రియ పూర్తయినా తరువాత ఓటర్ల లేక్క తేలింది. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌తో పాటు ఆర్డీవో, తహసిల్థార్‌, మండల పరిషత్‌, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పోలింగ్‌ బూత్‌ల వద్ద జాబితా ప్రదర్శించారు.

kumaram bheem asifabad-లెక్క తేలింది
లోగో

- ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

- గల్లంతయ్యే ఓట్లపై ఉత్కంఠ, అభ్యంతరాలు అప్పీలుకు నెలరోజుల గడువు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియ పూర్తయినా తరువాత ఓటర్ల లేక్క తేలింది. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌తో పాటు ఆర్డీవో, తహసిల్థార్‌, మండల పరిషత్‌, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పోలింగ్‌ బూత్‌ల వద్ద జాబితా ప్రదర్శించారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 684 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,07,457 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 2,04,705 మంది, మహిళలు 2,02,726 మంది, థర్డ్‌ జెండర్‌ ఓటర్లు26 మంది ఉన్నారు. మృతిచెందిన వారితో పాటు శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓట్లు కలిగిన వారిని జాబితా నుంచి తొలగించారు. బీఎల్‌వోలు 45రోజుల పాటు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఓటర్లకు అందించి పూర్తి చేసిన ఫారాలను తీసుకొని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి అన్‌లైన్‌లో డిజిటలైజేషన్‌ చేశారు. ప్రసుత్తం వెలువడిన ఓటరు జాబితాలో తమపేరు ఉందా లేదా అని వెతికే పనిలో ఓటర్లు పడ్డారు.

- గడువులోగా..

ఆసిఫాబాద్‌ జిల్లాలో సర్‌ ప్రక్రియకు ముందు 4,55,596 మంది ఓటర్లు ఉండగా గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన 4,07,457 మంది ఓటర్ల పేర్లను బీఎల్‌వోలు డిజిటలైజేషన్‌ చేశారు. వీరి పేర్లను మాత్రమే ముసాయిదా జాబి తాలో ప్రకటించారు. ఫారాలు తిరిగి ఇవ్వని అన్‌కలెక్టబుల్‌, పర్మనెంట్‌ షిఫ్ట్‌, డెత్‌, డూప్లికేట్‌ 48,139 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి ప్రచురించారు. ముసాయిదా జాబితాలో ఉండే 84,990 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు కలి గి ఉండడం, మ్యాపింగ్‌ జరుగకపోవడంతో వారిని అనుమానాస్పద ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరందరికీ అక్టోబరు 15 వరకు ఎలకో్ట్రరల్‌ రిజిస్టర్‌ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. తొలగించిన 43,139 మంది ఓటర్లు, నోటీసులు అందుకోనున్న 84,990 మంది ఓటర్లు కలిపితే 1,33,129 మంది జాబితాలో తమ పేరు తొలగింపు ముప్పు ఎదుర్కోనున్నారు. 2002 ఓటర్ల జాబితాలో తమపేరు/తల్లిదండ్రులు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్‌ ఫారం లో పూరించాల్సి ఉంది. ఈ వివ రాలను ఇవ్వడంలో విఫలమైన లేక తప్పుడు వివరాలు ఇచ్చిన వారిన అన్‌మ్యాప్డ్‌గా గుర్తించారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో చాలామంది ఎన్యూమరేషన్‌ ఫారంలోని సర్‌-2002 ఓటర్ల జాబితాలోని వివరాలు రాయాల్సిన భాగంలో ప్రసు ్తత ఓటర్ల జాబితాలోని వివరాలు రాశారు. దీంతో వీరు సైతం నోటీసులు అందుకోక తప్పడంలేదు.

- నోటీసు వస్తే..

సర్‌ నోటీసు వస్తే సెప్టెంబరు 16లోగా ధ్రువప త్రాలు చూపించాలి. జూలై1,1987 కంటే ముందు పుట్టిన వారు 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపాలి. జూలై 1, 1987 నుంచి డిసెంబరు 2, 2004 మధ్య పుట్టిన వారు ఒక గుర్తింపు కార్డుతో పాటు తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరి గుర్తింపు కార్డు కూడా చూపాలి. డిసెంబరు 2, 2004 తర్వాత పుట్టిన వారు సొంత గుర్తింపు కార్డుతో పాటు తల్లిదండ్రులిద్దరి పత్రాలు చూపించాలి. కాగా ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు, తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి క్లెయింలు, అభ్యంతరాలపై అందే దరఖాస్తులను అక్టోబరు 15 వరకు స్వీకరిస్తారు. అలాగే అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లునిం డిన యువతతో పాటుముసాయిదా ఓటరు జాబితా లో పేరులేని వారు నిబంధనల ప్రకారం ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి. వచ్చిన క్లెయింలు, అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబరు 19న తుది జాబితాను ప్రచురిస్తారు.

Updated Date - Aug 19 , 2026 | 11:13 PM