ఫూలే దంపతుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:57 AM
మహాత్మ జ్యోతిరావుఫూలే, సావిత్రిభాయిఫూలే జీవితాలను స్పూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ముదిరాజ్ సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : మహాత్మ జ్యోతిరావుఫూలే, సావిత్రిభాయిఫూలే జీవితాలను స్పూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ముదిరాజ్ సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాత్య జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్య జ్యోతిరావుపూలే దంపతుల విగ్రహానికి ముఖ్య అతిథులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్ప దండి ప్రకాష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముది రాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సంవత్సరం క్రితం తాము ఇచ్చిన మాట ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహానీయుల విగ్రహాలను నెలకొ ల్పామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలలో ప్రగతి భవన్‌ను జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌గా మార్చారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శహన్మండ్లు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, అంబే ద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళా, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.