చెంచుల జీవన విధానం ప్రతిబింబించాలి
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:30 PM
చెంచులక్ష్మి మ్యూజియంలో అడవి జం తువులతో కలిసి చెంచులు జీవించే విధానం ప్రతిబింబించేలా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత కేశవ్ పాటి ల్ అన్నారు.
- చెంచులక్ష్మి మ్యూజియంను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
- మన్ననూరులో విస్తృతంగా పర్యటించిన వంశీకృష్ణ, హేమంత కేశవ్ పాటిల్
అచ్చంపేట/ మన్ననూర్, అక్టోబరు 8 (ఆంధ్ర జ్యోతి) : చెంచులక్ష్మి మ్యూజియంలో అడవి జం తువులతో కలిసి చెంచులు జీవించే విధానం ప్రతిబింబించేలా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత కేశవ్ పాటి ల్ అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో గురువారం వారు విస్తృతంగా పర్య టించారు. మొదట మన్ననూరులోని శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారిపై చెంచులక్ష్మీ మ్యూజియం వద్ద జరుగుతున్న అభివృద్ధి పను లను పరిశీలించారు. చెంచుల జీవనశైలి, అడవి జంతువులతో కలిసి జీవించే విధానాన్ని ప్రదర్శి స్తూ నల్లమలకు వచ్చే పర్యాటకులకు ఆకర్షణీ యంగా ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారు లను కోరారు. ఈ కేంద్రం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగు తాయన్నారు. అనంతరం గ్రా మంలోని పురుగుల గుట్ట వ ద్ద 220/33 సబ్‌స్టేషన్ నిర్మా ణానికి స్థలం పరిశీలించారు. త్వరలోనే శంకుస్థాపన, పను ల ప్రారంభానికి ఏర్పాట్లు చేసే విషయంపై అధికారులకు సూ చనలు చేశారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పనులను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, మన్ననూరు గ్రామ స ర్పంచు విస్లావత్ మంజుల, ఉప సర్పంచు రమణగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూలూరి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దా సరి శ్రీనివాసులు, కాంగ్రెస్ మండల అఽఽధ్యక్షుడు ఎంఏ రహీం, కాంగ్రెస్ నాయకులు చత్రూనా యక్, హన్మంత్‌రెడ్డి, రహిమాన్, రాజారాం, బిక్కు, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సిద్దాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ
అచ్చంపేట నియోజకవర్గంలోని సిద్దాపూర్ గ్రామంలో గురువారం ప్రభుత్వ బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజనం నాణ్యత, ఉపాధ్యాయుల బోధన తీరు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం వారు సిద్దాపూర్ శివారులో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధిత శా ఖల అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.