kumaram bheem asifabad- జీవ వైవిధ్యానికి ఊపిరి
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:27 PM
పచ్చని అడవులు, జలపాతాలు, నదులతో ప్రకృతి రమ ణీయతకు నిలయమైన జిల్లాలోని జలవనరులకు మహర్దశ పట్టనుంది. సహజసిద్ధమైన నీటి వనరులు, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ఏడు చెరువులను చిత్తడి నేలల కింద ఎంపిక చేసింది.
- నిధుల మంజూరుకు ప్రతిపాదనలు
ఆసిఫాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): పచ్చని అడవులు, జలపాతాలు, నదులతో ప్రకృతి రమ ణీయతకు నిలయమైన జిల్లాలోని జలవనరులకు మహర్దశ పట్టనుంది. సహజసిద్ధమైన నీటి వనరులు, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ఏడు చెరువులను చిత్తడి నేలల కింద ఎంపిక చేసింది. ఆయా చెరు వుల అభివృద్ధి, పర్యావరణ, ప్రకృతి సమతుల్యత ఆధా రంగా పనులు నిర్వహించేందుకు అటవీ అధికారు లు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
- ప్రాణహిత, పెన్‌గంగా..
జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగా, పెద్దవాగు, వట్టివాగు తదితర జీవనదులు ఉన్నాయి. నదులు, వాగులపై నిర్మించిన ప్రాజెక్టుల్లో వేసవిలోనూ సమృద్ధిగా నీరు నిల్వ ఉం టుంది. ఈక్రమంలోనే చిత్తడి నేలలుగా అభివృద్ధి చేయడానికి అనువుగా ఉన్న ఏడు చెరువులను ప్రభుత్వం ఎంపిక చేసింది. చిత్తడి నేలలుగా ఎంపికైన కాగజ్‌గర్ మండలం కోర్సిని చెరువు, తిర్యాణి మండలం ఎన్టీఆర్ సాగర్ ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. చింతలవ ూనేపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ చెరువు(33 హెక్టార్లు), పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ చెరువు(93 హెక్టార్లు)లో పనులకు అధి కారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వాంకిడి మండలంలోని నార్లాపూర్, రాంజీ చెరువు, నవేఝరి చెరువు పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తు న్నారు. అన్ని శాఖల సమస్వయంతో చిత్తడి నేలలకు సంబంధించిన అనుమతులను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా శాఖల నుంచి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రాలు) సేకరిస్తున్నారు.
- చేపట్టే అభివృద్ధి పనులు..
చెరువుల్లో పూడిక పేరుకుపోవడం, ఆక్రమణలు, నిర్వహణ లేకపోవడంతో చిత్తడి నేలలు రూపు కోల్పోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఎంపిక చేసిన చెరువుల వద్ద పలు అభివృద్ధి పనులు చేపట్టనుంది. ప్రధానంగా చెరువుల అభివృద్ధి, పర్యావరణ, ప్రకృతి సమతుల్యత ఆధారంగా పనులు నిర్వహిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతు న్నారు. చెరువుల్లో పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థాన్ని పెంచడంతోపాటు కట్టలను బలోపేతం చేయడం ద్వారా కోతను నివారించనున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యమైన చేప పిల్లలను వదలనున్నారు. చేప పిల్లల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారులు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా ఆదాయాన్ని పొందేందుకు అవకాశం కల్పి స్తారు. పక్షుల ఆవాసాలు, ఆహార లభ్యతను పెంచేందుకు మొక్కలను విస్తృతంగా నాటుతారు. పెంపకం, సంరక్షణకు నిధులను వినియోగిస్తారు. సందర్శకులు, అధికా రుల పర్యవేక్షణకు వాచ్ టవర్లను నిర్మిస్తారు. పచ్చదనం కోసం స్థానిక జాతుల మొక్క లను పెంచడం, పక్షులను ఆకర్షించేందుకు చెరువుల మధ్యలో మట్టి దిబ్బలను ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
- చిత్తడి నేలల ప్రాధాన్యం
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో చిత్తడి నేలలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని భూమికి జీవం పోసే అవయవాలుగా భావిస్తారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచడమే కాకుండా వరద ఉధృతిని తగ్గించడంలోనూ దోహదపడతాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న చిత్తడి నేలలు దేశ, విదేశీ పక్షులను ఆకర్షిస్తున్నాయి. జలాచరాలకు ఆవాసాలుగా ఉన్నాయి.
- ఎంపిక చేసిన చెరువులు ఇలా..
మండలం చెరువు
-----------------------------------
చింతలమానేపల్లి అర్కగూడ
పెంచికల్‌పేట్ ఎల్లూర్
కాగజ్‌నగర్ కోర్సిని
తిర్యాణి ఎన్టీఆర్‌సాగర్
వాంకిడి నార్లాపూర్, రాంజీ. నవేఝరి