కుష్ఠువ్యాధి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:48 PM
కుష్టువ్యాధి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ అన్నారు.
డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
హాజీపూర్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : కుష్టువ్యాధి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం హాజీపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సంద ర్శించారు. రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కుష్టువ్యాధి నివారణలో భాగం గా నవంబరు 4 వరకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికి వెళ్లి కు ష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపుకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే నిర్వహిస్తున్నారన్నా రు. జిల్లాలోని సుమారు 8 లక్షల జనాభాకు 2.12 లక్షల ఇళ్లను సర్వే చేస్తా రన్నారు. 650 టీంల ద్వారా సర్వేను నిర్వహిస్తున్నామని, ఎలాంటి స్పర్శ లేని మచ్చలు ఉన్నా ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. వైద్య సిబ్బందికి ప్ర జలందరూ సహకరించాలన్నారు. అలాగే అన్ని ఆరోగ్య కార్యక్రమాలను పక డ్బందీగా నిర్వహించాలన్నారు వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెం కటేశ్వర్, సూపర్ వైజర్‌లు రఘుపతి, పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.