న్యాయవాదుల రక్షణచట్టం అమలు చేయాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 10:59 PM
న్యాయవాదులకు రక్షణచట్టం లేకపోవడం వల్లే కేసుల విషయంలో ప్రతీకార దాడులు బెదిరిం పులు, అవమానాలు జరుగుతున్నాయని, రక్షణ చట్టం అమలు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ కోరారు.
- అచ్చంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్
- న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష ప్రారంభం
అచ్చంపేటటౌన్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : న్యాయవాదులకు రక్షణచట్టం లేకపోవడం వల్లే కేసుల విషయంలో ప్రతీకార దాడులు బెదిరిం పులు, అవమానాలు జరుగుతున్నాయని, రక్షణ చట్టం అమలు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ కోరారు. న్యాయవాదుల రక్ష ణచట్టం అమలుచేయాలని కోరుతూ బుధవారం పట్టణంలో కోర్టు ముందు అచ్చంపేట న్యాయవా దులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. న్యాయవాదులకు మద్దతుగా సీనియర్ వ్యాయ వాది, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేంద ర్ పాల్గొని మద్దతు తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది అడ్వకేట్లు దాడులకు గుయ్యారని, కొంత మంది హ త్యలకు కూడా బలయ్యారన్నా రని పేర్కొన్నారు. కోర్టులో వృత్తి ఽధర్మం ప్రకారం కేసులు వాదించినందుకే ప్రాణాలు కో ల్పోవాల్సి వస్తున్నదని, అది న్యాయ వ్యవస్థకే మచ్చ అన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయ వాదులు సత్తయ్య, వెంకట్‌శెట్టి, రవీందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటరమణ, రవికుమార్, శ్రీధర్‌రావు, వెంకటేశ్వర్‌రావు, సుధాకర్, మల్లేష్, చందులాల్, చత్రునా యక్ పాల్గొన్నారు.
రెండవ రోజు దీక్షలు
కల్వకుర్తి, (ఆంధ్రజ్యో తి) : న్యాయవాదుల ర క్షణ చట్టం ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తా మని కల్వకుర్తిన్యాయ వా దులు స్పష్టం చేశారు. కల్వకుర్తి పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష బుధవా రం రెండవ రోజు కొనసా గింది. దీక్షలో ఎండీ జమీ ల్‌అహ్మద్, ఏ రాంగోపాల్, నాగరాజు, శివ కుమార్, శ్రీకాంత్, న్యాయవాదులు కూర్చున్నా రు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షు డు నరేందర్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
కొల్లాపూర్‌లో రిలే దీక్షలు
కొల్లాపూర్, (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ జూని యర్ సివిల్ కోర్టు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రెండవ రోజు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు తిప్పరాజులు, రాఘవేంద్ర, రాజేష్, కురుమూర్తి, బాలస్వామి, మధుసూదన్‌రావు రిలే దీక్షలో కూర్చున్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరిక ట్టేలా న్యాయవాదుల రక్షణ చట్టం ప్రభుత్వం అమలు పరచాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరా జు, సీనియర్ న్యాయవాదులు ఉపేందర్, భాస్క ర్‌రెడ్డి, శివారెడ్డి, మోహన్‌లాల్, జేసీ కుర్మయ్య, మనోహర్, నిరంజన్, నళిని, రామలక్ష్మమ్మ, నజీరుద్దీన్ పాల్గొన్నారు.