Share News

kumaram bheem asifabad- భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:38 PM

జిల్లాలో భూ రీసర్వే పనులను వేగవంతంచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మండల సర్వేయర్లకు జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ పరికరాలు భూ రీసర్వే ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడనున్నాయని నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలవుతుందని తెలిపారు.

kumaram bheem asifabad- భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలి
:జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లను సర్వేయర్లకు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ హరిత భూముల రీసర్వే పనులను

ఆసిఫాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ రీసర్వే పనులను వేగవంతంచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మండల సర్వేయర్లకు జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ పరికరాలు భూ రీసర్వే ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడనున్నాయని నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఏడీ వినయ్‌, తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో క్రమశిక్షణ పాటించాలి

విధుల్లో క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌లతో కలిసి కారుణ్య నియామకం కింద జిల్లాలోని ప్రభుత్వ శాఖలలో ఆరుగురికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులుగా పనిచేసి వివిధ కారణాల వల్ల మరణించిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులలో ఒకరిని కారుణ్య నియామకం కింద నియమించామని తెలిపారు. ముగ్గురిని వివిద శాఖలలో జూనియర్‌ అసిస్టెంట్లుగా, మరో ముగ్గురిని వివిధ శాఖలలో కార్యాలయ సబార్డీనేట్‌లుగా నియమించామని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ జాస్తీన్‌ జోయల్‌, ఏవో కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:38 PM