పల్లెల్లో గుడుంబా కిక్కు..
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:18 PM
చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా (నాటుసారా) విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అయినా కూడా సం బంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-నిద్రమత్తులో ఎక్సైజ్ శాఖ
ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజలు..
చెన్నూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా (నాటుసారా) విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అయినా కూడా సం బంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని చెన్నూరు, కోట పల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో గుడుం బా విక్రయాలు జోరుగా సాగుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎక్కడ పడితే అక్కడ నాటు సారా లభిస్తుండడంతో దానికి బానిసై న యువకు లు, పెద్దలు మద్యం మత్తులో తులతూగుతున్నాయి. 15 రోజుల క్రితం పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన వ్యక్తి అతిగా గుడుంబా సేవించి మృతిచెందిన ఘటన ఆ కుటుంబంలో విషా దాన్ని నింపింది. నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి ప దార్థాలైన నల్ల బెల్లం, పటిక, వివిధ రసాయనిక పదార్ధాలు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుండడంతో గుడుంబాను తయారు చేసి ప్యా కెట్లుగా చేసి విక్రయిస్తుండడం పలువురిని విస్మయానికి గురి చే స్తుంది. ప్రాణహిత పరివాహక ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి నాటుసారా ప్యాకెట్లను పక్కనే ఉన్న మ హారాష్ట్రలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మహా రాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాను ఆ ప్రభుత్వం ఆదివాసీ జిల్లాగా గుర్తించి ఆ జిల్లాలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసింది. దీనిని అదు నుగా మలుచుకున్న గుడుంబా విక్రయదారులు ప్రాణహిత నది గుండా నాటుసారాను రవాణా చేస్తున్నారు. మండలంలోని వెం కంపేట, పొక్కూరు, బీరవెల్లి, లంబడిపల్లి తదితర గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ నాటుసారా తయారు చేస్తున్నారు. గత నెల రోజుల క్రితం చెన్నూరు పోలీసులు నిర్వహించిన నాకాబందీలో లంబడిపల్లె గ్రామంలో తయారీకి సిద్దంగా ఉన్న వేల లీటర్ల బె ల్లం పానకం ధ్వంసం చేసి నాటుసారాను స్వాధీనం చేసుకుని ప లువురిపై కేసులు నమోదు చేశారు. నాటుసారా విక్రయ స్థావరా లతో పాటు తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు మాత్రం మిన్న కుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి నాటు సారా తయారీ కేంద్రాలు, స్ధావరాలపై దాడులు చేసి వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-కుటీర పరిశ్రమలుగా నాటుసారా తయారీ కేంద్రాలు
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కుటీర పరిశ్రమలుగా నాటుసారా తయారీ కేంద్రాలను పలువురు తయారు చేసుకుం టున్నారు. చెన్నూరు మండలంలోని లంబడిపల్లె, సంకారం, బు ద్దారం తదితర గ్రామాల్లోని మామిడితోటలు, అడవులు, చిన్న చిన్న ఓర్రెలు వీటికి ఆవాసాలుగా ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. అలాగే పొక్కూరు, వెంకంపేట, రచ్చపల్లి, అంగ్రాజ్పల్లి, కో టపల్లి మండలంలోని ప్రాణహిత పరివాహక ప్రాంతాలైన ఆల్గా మ, పుల్లగామ, అన్నారం, దేవులవాడ, అడవి ప్రాంతాలైన నక్కల పల్లి, ఎసన్వాయి, పారుపెల్లి తదితర గ్రామాల్లోని అడవుల్లో ఎక్కడ చూసినా నాటుసారా తయారీ కేంద్రాలే దర్శనమిస్తు న్నా యి. అయితే ఎక్సైజ్ అధికారులు అడపాదడపా దాడులు చేసి పట్టించుకోకపోవడం విశేషం. దాడులకు ముందే కిందిస్థాయి సి బ్బంది నుంచి సమాచారం అందుతుందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. నాటుసారా తయారీ కేంద్రాల వారు నెల నెల అధికారులకు మామూళ్లు ఇవ్వడం వల్లనే నాటుసారా, గుడుంబా విచ్చల విడిగా వారి కనుసన్నల్లోనే నడుస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.