Share News

కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్‌ల కోసమే కట్టారు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:12 PM

గతంలో పరిపాలించిన కేసీఆర్‌ ప్రభుత్వం కమిషన్‌ల కోసమే గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మించారని, దీని వల్ల రైతులకు ఉపయోగం లేకుండా పోయిందని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్‌వెం కటస్వామి పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్‌ల కోసమే కట్టారు
జైపూర్‌లో కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

-మంత్రి వివేక్‌వెంకటస్వామి

జైపూర్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : గతంలో పరిపాలించిన కేసీఆర్‌ ప్రభుత్వం కమిషన్‌ల కోసమే గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మించారని, దీని వల్ల రైతులకు ఉపయోగం లేకుండా పోయిందని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్‌వెం కటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బాక్స్‌ క్రికెట్‌ కోర్టును ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో పలువురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌ చె క్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీ డా వికాసం కోసం అధునాతన హాస్టోటర్బ్‌ మైదానంతో పాటు ఉచి త క్రికెట్‌ కిట్‌లను మంజూరు చేశామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, ఏసీపీ వెంకటేశ్వర్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, గ్రామ సర్పంచు కూన భాస్కర్‌, తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంఈవో శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు మంతెన లక్ష్మణ్‌, రవీందర్‌రెడ్డి, ముక్త శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, నర్సయ్య, సత్యనారాయణరెడ్డి, జక్కుల వెంకటేశం, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:12 PM