Share News

జన జాగరణ యాత్రను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:46 PM

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయా లని కోరుతూ జూలై 16న కల్వకుర్తిలో నిర్వ హించే జన జాగరణ యాత్రను విజయవంతం చేయాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధా న కార్యదర్శి లక్ష్మీనరసింహారావు కోరారు.

జన జాగరణ యాత్రను విజయవంతం చేయాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న లక్ష్మీనరసింహారావు, నాయకులు

- టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహారావు

కల్వకుర్తి, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయా లని కోరుతూ జూలై 16న కల్వకుర్తిలో నిర్వ హించే జన జాగరణ యాత్రను విజయవంతం చేయాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధా న కార్యదర్శి లక్ష్మీనరసింహారావు కోరారు. బుధ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ బా లుర ఉన్నత పాఠశాలల్లో జన జాగరణ యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఉదయం 9గంటల నుంచి బైక్‌ ర్యాలీ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌గౌడ్‌, రాష్ట్ర నాయకు లు పాల్గొంటారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం డివిజన్‌ అధ్యక్షుడు రాజేందర్‌, ప్రభు త్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు వేణుగోపాల్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 10:46 PM