బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:35 AM
బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీగీతే ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాల యంలో
సిరిసిల్ల అర్బన్, ఆగుస్టు 3 (ఆంఽధ్రజ్యోతి): బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ మహేష్ బీగీతే ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాల యంలో సోమవారం నిర్వహించిన గ్రీవేన్స్‌డేకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని 38 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అయా మండలాల పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌ఐలతో ఫోన్‌లో మాట్లాడి భాధితు లు ఇచ్చిన ఫిర్యాదులను క్షుణంగా పరిశీలించి పరిష్కరించి వారికి సమా చారం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్‌బీగీతే మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగు తుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీక రించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్‌డే ద్వారా ప్రజలు నేరు గా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్య మైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామన్నారు.