Share News

బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:41 AM

భాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని

బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
బాధితుల సమస్యలను వింటున్న ఎస్పీ

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబర్‌ 7 (ఆంఽధ్రజ్యోతి) : భాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని 33 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వచ్చిన ఫిర్యాదుల అధారంగా అయా మండలాల పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌ఐలతో ఫోన్‌లో మాట్లాడి భాధితు లు ఇచ్చిన ఫిర్యాదులను క్షుణంగా పరిశీలించి పరిష్కరించి వారికి సమా చారం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్‌బీగీతే మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషిచేయడం జరుగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీ లించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. గ్రీవెన్స్‌ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమ స్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

- వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సీవీ అనంద్‌

జిల్లాలో ఈ నెల 14నుంచి ప్రారంభమయ్యే గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రణాళికాబద్దంగా బందోబస్తు భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సీవీ అనంద్‌ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం నుంచి గణేష్‌ నవరాతోత్సవాలపై జిల్లా ఎస్పీతో డీజీపీ సీవీ ఆనంద్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గణేష్‌ మండపాలు, విగ్రహాల ఏర్పాటు ప్రదేశాలను ముందు గానే గుర్తించి, మండపాల వివరాలు, ఊరేగింపు మార్గాలు, తేదీలు, సమ యాలు తదితర పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. సున్నిత మైన ప్రాంతాలు, వివాదాస్పద ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీజేలు, బాణసంచా వినియోగంపై నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. నిరంతర నిఘా కొనసాగించాలని, సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లు, కమ్యూనల్‌ రౌడీలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండపాల వద్ద విధులు నిర్వహించే సిబ్బందిని ముందుగానే నియమించి, వారి విధులు, బాధ్యతలపై ప్రత్యేక బ్రీఫింగ్‌ ఇవ్వాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే, డీఎస్పీలు నాగేంద్రచారీ, వెంకటేశ్వర్లు, సీఐ మధుకర్‌, ఆర్‌.ఐ లు మధుకర్‌, సురేష్‌, రమేష్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:41 AM