Share News

బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:29 AM

భాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భాధితులతో మట్లాడి వారి సమస్యలను

బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : భాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగితన పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భాధితులతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని 17 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వచ్చిన ఫిర్యాదుల అధారంగా ఆయా మండలాల పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌ఐలతో ఫోన్‌లో మాట్లాడి భాధితు లు ఇచ్చిన ఫిర్యాదులను క్షుణంగా పరిశీలించి పరిష్కరించి వారికి సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్‌బీగీతే మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలం దించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్‌ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని జిల్లా ఎస్పీతెలిపారు.

Updated Date - Jul 28 , 2026 | 12:29 AM