శాస్ర్తీయ పద్ధతుల్లో దర్యాప్తు చేపట్టాలి
ABN , Publish Date - Jul 07 , 2026 | 10:38 PM
నేరాల దర్యాప్తును శాస్ర్తీ య పద్ధతుల్లో చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు.
సీపీ అంబర్‌కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం, జూలై7 (ఆంధ్రజ్యోతి): నేరాల దర్యాప్తును శాస్ర్తీ య పద్ధతుల్లో చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. కమిషనరేట్‌లో కాళేశ్వర్ జోన్ స్థాయి పోలీసు డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి, మంచిర్యా ల, కొమురంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుకాగా ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డ్యూటీమీట్ అనేది అవార్డులు, రివార్డులు అందుకోవడానికి నిర్వహించే కార్యక్రమం కాదని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచు కోవడానికి రోజువారి స్వీయ సమీక్ష చేసుకునేందుకు ఇదీ ఉత్తమ వేదిక అన్నారు. పోటీలో గెలుపు ఓటముల కంటే పాల్గొనే అధికారులు పొందే అనుభవమే ముఖ్యమన్నారు. డ్యూటీ మీట్‌లోనేర్చుకున్న అం శాలను తమ యూనిట్లలో అమలు చేస్తే పనితీరు మరింత మెరుగు పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తుల్లో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన మెలకువలను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. వేలి ముద్రల విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం అనుసరిం చాల్సిన విధానాలపై సమగ్ర అవగాహన పెంపొందించేందుకు ఇదీ ఎంతగానో ఉపయోగడపడుతుందన్నారు. డ్యూటీమీట్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులు కాళేశ్వరం జోన్ తరుపున హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలోనిర్వహించే రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీమీట్‌లో పాల్గొంటారని వెల్లడించారు. నాలుగు విబాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్‌కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచీ ఏసీపీ నాగేంద్రగౌడ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.