విచారణ షురూ...!
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:21 PM
సింగరేణి ఓపెన్‌కాస్టు గని ఏర్పాటు కోసం సేకరించే భూముల్లో ఎట్టకేలకు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు సిం గరేణి విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి, సంభదిత భూములపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపు తున్నట్లు తెలిసింది.
-రంగంలోకి సింగరేణి విజిలెన్స్ బృందం..?
-ఓసీపీ భూముల్లో నిలిచిన చెక్కుల పంపిణీ
-అసలు పట్టేదారుల వివరాల సేకరణలో నిమగ్నం
-’ఆంధ్రజ్యోతి’ కథనంతో కదులుతున్న అవినీతి డొంకా
మంచిర్యాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఓపెన్‌కాస్టు గని ఏర్పాటు కోసం సేకరించే భూముల్లో ఎట్టకేలకు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు సిం గరేణి విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి, సంభదిత భూములపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపు తున్నట్లు తెలిసింది. ’పరిహారం...పరిహాసం’ శీర్షికన గ త నెల 19న ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కా వడంతో అవినీతి డొంక కదులుతోంది. ఈ క్రమంలో భూములకు నష్ట పరిహారం చెల్లింపులకు సంబంధిం చిన చెక్కులను అధికారులు నిలిపివేసినట్లు సమచా రం. జైపూర్ మండలం రామారావుపేట గ్రామ పంచా యతీతోపాటు దాని పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలోని 77.15 ఎకరాలను శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు-2 గని విస్త రణ కోసం సింగరేణి అఽధికారులు భూ సేకరణ జరిపా రు. ఇందులో భాగంగా సంబంధీకుల జాబితా కూడా తయారు చేశారు. ఆ భూములు గతంలో పలువురికి ప్రభుత్వం అసైన్డ్ చేయగా, కాలక్రమంలో అవి ఇత రుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం వాటికే సింగరేణి తరుపున పరిహారం అందజేసేందుకు అధికారులు రం గం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో పరిహారం చెల్లింపులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
రీ సర్వేకు సన్నాహాలు....
సింగరేణి ఓసీపీ కింద సేకరించే భూముల రీ సర్వే కు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా పై భూములు ఎవరి పేరిట ఉన్నాయి...? వారికి ఎలా వరించాయి...? వారి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి...? అధికారులు తయారు చేసిన జాబితాలో ఉ న్న పేర్లు....రికార్డుల్లో ఉన్న పేర్లకు పొంతన ఉందా...? అన్న కోణంలో విచారించేందుకుగాను రీ సర్వే చేపట్టా లని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అక్రమంగా జాబితాలో చోటు సంపాధించిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు నిర్ణయించిన ప్రకారం ఓసీపీ భూముల రీ సర్వే చేపడితే...నిజమైన అర్హులకు మా త్రమే మేలు చేకూరే అవకాశం ఉంది. తద్వారా సిం గ రేణి సొమ్ము పక్కదారి పట్టకుండా కాపాడినట్లు అవు తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పరిహారం పెంపునకు డిమాండ్....
ఓసీపీ విస్తరణ కోసం సేకరించే భూములకు పరి హారం పెంచాలనే డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. మొదట జనరల్ ప్యాకేజీ కింద ఎకరాకు 15.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. భూముల్లో కొందరు పట్టేదారులు ఉండగా, జనరల్ ప్యాకేజీకి వారు అంగీకరించడం లేదని సమాచారం. ప ట్టేదారులు ఒక్కో ఎకరాకు రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తుండగా, మిగతా భూములకు జనరల్ ప్యాకేజీని కూడా రూ. 40 లక్షలకు పెంచాలనే డిమాండ్‌లు విని పిస్తున్నాయి. ఇదిలా ఉండగా, జనరల్ ప్యాకేజీని రూ. 16 లక్షలకు పెంచేందుకు సింగరేణి అధికారులు సు ముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామారా వుపేట, దుబ్బపల్లి గ్రామాల్లో అసలు అసైన్డ్ భూములే లేవని, సింగరేణి సేకరించే భూములన్నీ పట్టా భూ ములేనని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఒక వేళ అధికారులు చెబుతున్న ప్రకారం గ్రామంలో అసై న్డ్ భూములే లేకపోతే, సింగరేణి అధికారులు జనరల్ ప్యాకేజీ ప్రకటించడం పట్ల పట్టేదారులు అంగీకరిస్తా రా...? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసైన్డ్ భూములు అయినందునే వాటిన్నంటికి గంపగుత్తగా ప్యాకేజీ ప్రకటించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అక్రమ వసూళ్ల మాటేమిటి...?
సింగరేణి సేకరించే భూములకు సంబంధించిన అం శంలో కొందరు మధ్యవర్తులుగా అవతారమెత్తారని బ హిరంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జాబి తాలో ఉన్న లబ్దిదారులు ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల వరకు అక్రమంగా వసూళ్లు చేసినట్లు ఆరోపణ లు ఉన్నాయి. ఒకవేళ రామారావుపేట, దుబ్బపల్లి గ్రా మాల్లోని భూములన్నీ పట్టా భూములే అయితే అక్ర మంగా డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఏమొ చ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నేరుగా పట్టే దారుల అకౌంట్లలోనే పరిహారం డిపాజిట్ అవుతుండగా, మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం ఏమిటనే పలువురు ప్రశ్నిస్తున్నారు. అసైన్డ్ భూములు కావడం, ఇతరుల చేతుల్లోకి వెళ్లడంతో ఎలాగైనా ఆ ఇతరుల పేరిటనే చెక్కులు పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డబ్బులు వసూలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.
భూముల అసలు లబ్ధిదారులకు కాకుండా తమ పే రిట పరిహారం ఇచ్చేలా పై వర్గాలకు చెందిన బడా బా బులు పెద్ద తతంగమే నడిపారు. అధికారులను మశ్చి క చేసుకొనే క్రమంలో దళారీ వ్యవస్థకు ఆజ్యం పోశా రు. దళారులుగా అవతారమెత్తిన ఇద్దరు, ముగ్గు రు వ్యక్తులు బడా బాబుల నుంచి రూ. 5 లక్షల చొప్పు న వసూలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. విషయం బయటకు పొక్కడంతో భూములు అసలు లబ్దిదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిహా రంగా వచ్చిన సొమ్ము నుంచి కొంత మొత్తం ఇస్తామ ని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ అక్రమ బాగోతం విషయమై భూముల రీ సర్వే చేపట్టాలని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేగుంట నారాయణ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోతో పాటు శ్రీరాంపూర్ సింగరేణి జనరల్ మేనేజర్‌కు లిఖి తపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెండు నెలలు గడి చినప్పటికీ అధికారులు పట్టించుకోకపోగా, గుట్టు చప్పు డు కాకుండా పరిహారం చెల్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా భూముల రీ సర్వే చేపడతారా...? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.