భారత రాజ్యాంగం ప్రపంచానికే స్ఫూర్తి
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:06 AM
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్ర పంచ దేశాలకే స్పూర్తిగా నిలుస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల మైదానం లో గణతంత్ర వేడుకలను అట్టహాసంగా నిర్వ హించారు.
త్యాగదనులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి
ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలి
మంచిర్యాలకలెక్టర్, జనవరి26 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్ర పంచ దేశాలకే స్పూర్తిగా నిలుస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల మైదానం లో గణతంత్ర వేడుకలను అట్టహాసంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ సం పత్ కుమార్ నేతృత్వంలో పోలీసు గౌరవ వంద నాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 5కోట్ల 78లక్షల మంది మహిళ లకు 102కోట్ల37లక్షల రూపాయల లబ్ది చేకూరిం దన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 18వేల 949 పేదల కోసం 34కోట్ల4లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లను లక్ష28వేల 713 మందికి లబ్ది చేకూర్చామన్నారు. రుణ మాఫీ ద్వారా 64వేల 452 మంది రైతులకు 540కోట్ల రూపాయలు రుణ మాపీ చేశామన్నారు. జిల్లాలో రైతు భరో సా, రైతు బీమా ద్వారా రైతులకు లక్ష52వేల మంది రైతులకు 198కోట్ల13లక్షలు, రైతు బీమా 5కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ఉద్యావన శాఖ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, భూ భారతి తదితర స్కీంలతో జిల్లా లో ఆయిల్ పాంలు 2వేల హెక్టార్లలో ఏర్పాటు చేసి ఇంది రమ్మ ఇండ్ల ద్వారా పదివేల 930 ఇం డ్లు మంజూరు కాగా అందులో నిర్మాణ దశలో 7772 గ్రౌండింగ్ చేయబడ్డాయన్నారు. 24 ఇండ్లు పూర్తి చేశామని తెలిపారు. లబ్దిదారుల ఖాతాల్లో 107 కోట్లను జమ చేశామన్నారు. నూతన రేష న్‌కార్డులు 37వేలు మంజూరయ్యాయని సన్న బి య్యం 2లక్షల 54వేల రేషన్‌కార్డుల ద్వారా 4783 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపిణీ చేశామన్నా రు. భూ భారతి, ఇందిరా మహిళా శక్తి, విద్యాశా ఖ, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, మత్స్యశాఖ, నీటి పారుదలశాఖ, పశుసంవర్ధకశాఖ, గ్రామీణ అభివృద్ధిశాఖ, ఇతర డిపార్టుమెంట్ల ద్వారా జిల్లా లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు. కల్యాణ లక్ష్మికి 34వేల 346 మంది ఆడబిడ్డలకు చెక్కులు అందజేశామన్నారు. పుర పాలక సంఘాలకు 5కోట్ల రూపాయల నిధులతో సమీకృత కూరగాయల మార్కెట్లు, ప్లేగ్రౌండ్‌లు, చిల్డ్రన్ పార్కులు, మురుగు కాలువలు, మహిళ భవనాలు, ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేసి అమృ త్ 2.వో పథకం 275కోట్ల అభివృద్ధి పనులు చే యిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటి నిర్మాణం కోసం 300 కోట్ల రూపాయ ల పనులు జరుగుతున్నాయని నర్సింగ్ కళాశాల, క్రిటికెట్ కేర్ ఆసుపత్రి నడుస్తున్నాయన్నారు. హా జీపూర్ మండలం గుడిపేటలో 216కోట్ల రూపా యలతో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయిందని చెన్నూరు, లక్షెట్టిపేటలో సామాజిక ఆరోగ్య కేం ద్రం ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. అ బ్కారీశాఖ ద్వారా గుడుంబ రహిత మంచిర్యాల జిల్లాగా మద్యపాన నిషేద అబ్కారీశాఖ, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేస్తున్నాయన్నారు. అటవిశాఖ ద్వారా 45లక్షల మొక్కలు నాటడం జరిగిందని, సర్పంచ్‌లకు శిక్షణ తరగతులతో పా టు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామ అ భివృద్ధి గ్రామ వికాసమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. సింగరేణి కంపెనీలు, రో డ్లు, రైళ్లు, రవాణ వ్యవస్థ, సాగునీటి సంపద జిల్లా అభివృద్ధిలో ప్రత్యేకభూమిక పోషిస్తున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలె క్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్, డీసీపీ భాస్కర్, అటవిశాఖ అధికారి శి వ్ ఆశీష్ సింగ్, జిల్లా అధికారులు డీఆర్‌డీవో కి షన్, డీపీవో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గప్రసాద్, ఏవో రాజేశ్వర్, డీపీఆర్‌వో క్రిష్ణ మూర్తి, డీడబ్ల్యువో రవూఫ్‌కాన్, పోలీసు అధికా రులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మత్స్యశాఖ, గ్రామీణ అభివృద్ధిశాఖ, వైద్య శాఖ, పశుసంవర్ధకశాఖ, విద్యాశాఖ రవాణశాఖ, ఉద్యానవనశాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధికారుల శకటాలను కలెక్టర్ అధికారుల ముందు ప్రత్యేక శకటాల ద్వారా నిర్వహించారు. అనంతరం స్టాళ్లను సందర్శించి వాటి వివరాల ను తీసుకున్నారు.
ఆకట్టుకున్న పోలీసు కవాతు....
జిల్లా కలెక్టర్ బాలుర ఉన్నత పాఠశాలలో బె ల్లంపల్లి కమాండెంట్ ఎన్. సంపత్‌కుమార్ నేతృ త్వంలో పోలీసుల కవాతు ఆకట్టుకుంది. కలెక్టర్ కు ప్రత్యేక గౌరవ వందనం సమమర్పించారు. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నా రుల సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. శార్వాని నృత్యాలయం, సోషల్ వె ల్పేర్ పోస్టుమెట్రిక్ విద్యార్థుల నృత్యాలు ఆహు తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సం బంధిత అధికారులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట: పట్టణంతో పాటు మండలం లోని అన్ని గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగు రవేశారు. జడ్జి సాయికిరణ్ కసమల, తహ సీ ల్దార్ దిలీప్‌కుమార్, సీఐ రమణమూర్తి, మున్సి పల్ కమిషనర్ విజయ్‌కుమార్. ఎంపీడీవో సరో జ, సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, ఏవో శ్రీకాంత్, సీడీపీవో రేష్మా, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో సాగరిక జాతీయ జెండాలను ఎగురవేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజే నాయకులు మాజీ ఎ మ్మెల్యే దివాకర్‌రావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షు డు ఆరీఫ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్‌రావు ఆయా పార్టీల నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసారు.
చెన్నూరు : చెన్నూరు పట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి జాతీయ పతా కాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు, ప్రభు త్వ పాఠశాలల్లో అధికారులు, ప్రధానోపాధ్యా యులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వి ద్యాసంస్థల్లో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమా లను నిర్వహించారు.