Share News

kumaram bheem asifabad- యుద్ధం ప్రభావం..నిర్మాణం భారం

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:28 PM

పశ్చిమాసి యాలో జరుగుతున్న యుద్ధం ప్రభా వం నిర్మాణ రంగంపై తీవ్రస్థాయిలో చూపుతోంది. ఇప్పటికే చమురు కొరత సామా న్యులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నిర్మాణ రంగంపై కూడా తీవ్రంగా ఉండబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిమెంటు ధర బస్తాకు రూ.30నుంచి రూ.50వరకు పెరగను న్నదని ప్రచారం జరగడంతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

kumaram bheem asifabad- యుద్ధం ప్రభావం..నిర్మాణం భారం
బెజ్జూరులో నిర్మాణంలో ఉన్న ఇళ్లు

- బిల్డర్లు, సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరం

- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదాలకు తప్పని వాత

బెజ్జూరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసి యాలో జరుగుతున్న యుద్ధం ప్రభా వం నిర్మాణ రంగంపై తీవ్రస్థాయిలో చూపుతోంది. ఇప్పటికే చమురు కొరత సామా న్యులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నిర్మాణ రంగంపై కూడా తీవ్రంగా ఉండబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిమెంటు ధర బస్తాకు రూ.30నుంచి రూ.50వరకు పెరగను న్నదని ప్రచారం జరగడంతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకున్న సామాన్యులకు కూడా ఇది గుదిబండగా మారనున్నది. మార్కెట్‌ లో ఎక్కువగా వివిధ రకాల కంపెనీలకు చెందిన సిమెంటు బ్రాండ్లను వినియోగి స్తుంటారు. సిమెం టు బస్తా ప్రస్తుతం రూ.300 నుంచి రూ.320 వరకు ఉండగా, యుద్ధ ప్రభావంతో ఇది రూ.350 నుంచి రూ.360వరకు విక్రయిస్తున్నారని చెబుతు న్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- రానున్న రోజుల్లో..

రానున్న రోజుల్లో సిమెంటుతో పాటు స్టీల్‌, ఇసుక, ఇటుకల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు బిల్డర్లు, మేస్ర్తీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టీల్‌ టన్నుకు రూ.60వేల నుంచి రూ.62వేల వరకు ఉంది. రెండు, మూడు రోజుల్లో టన్నుకు అధనంగా రూ.5వేల నుంచి రూ.8వేల వరకు పెరగనుందని తెలుస్తోంది. అలాగే ఇసుక ధరలు కూడా పెరిగే అవ కాశం లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక ధర తక్కువగా ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో ఇసుక ధర ఇప్పటికే పెరిగింది. ఇక జిల్లాలో ఆన్‌లైన్‌ ద్వారా ఇసుకను బుకింగ్‌ చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో సామాన్యు లకు ఇది మరింత భారంగా మారనుంది. సిమెం టు, స్టీల్‌, ఇసు ధరలు పెరిగితే బిల్డర్లు, కాంట్రాక ్టర్లు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకో వాల నుకునే సామాన్యులపై తీవ్ర ప్రభావం పడవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికే అగ్రిమెంట్‌ చేసుకున్న బిల్డర్లు పాత ధరలకే నిర్మాణాలు చేయాల్సి ఉండడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పనుల కోసం అగ్రిమెంట్‌ చేసుకున్న కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు.

- నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు..

ధరల పెరుగుదలతో ఇందిరమ్మ ఇళ్ల పనులు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. సిమెంటు ధరల మంట ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం ఎంపికైన లబ్దిదారులకు రూ.5లక్షలు అందిస్తున్నది. ఇంటి నిర్మాణం కోసం ఇది సరిపోక ఇప్పటికే లబ్ధిదారులు అదనంగా మరో రూ.5లక్షల వరకు ఖర్చు చేస్తు న్నారు. సిమెంటు ధరలు పెరగడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మరింత భారంగా మారనుంది. అదనంగా ఒక్కో లబ్ధిదారుడిపై రూ.50వేల వరకు భారం పడనుంది.

ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి..

- మోహన్‌ ఎల్కపల్లి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ముడి సరుకులపై రాయితీ కల్పిస్తే ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే సుమారు రూ.8లక్షల వరకు ఖర్చు చేశా ను. సిమెంటు, స్టీల్‌ ధరలు మరింత పెరుగుతు న్నందున ఇంటి నిర్మాణం భారంగా మారుతోంది. ధరల పెరుగుదలతో సొంత ఇల్లు నిర్మించుకునేం దుకు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం పడకుండా ధరలను నియంత్రించాలి.

Updated Date - Apr 05 , 2026 | 10:28 PM