kumaram bheem asifabad- చెప్రాలలో భక్తుల సందడి
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:17 PM
రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొన్నది. బెజ్జూరు మండలం ఎల్కపల్లి గ్రామంలోని అభయాంజనేయసావమి ఆలయం నుచి మహారాష్ట్రలోని చెప్రాల ఆధ్మాత్మిక కేంద్రానికి పాదయాత్రగా భక్తులు తరలి వెళ్లారు.
బెజ్జూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొన్నది. బెజ్జూరు మండలం ఎల్కపల్లి గ్రామంలోని అభయాంజనేయసావమి ఆలయం నుచి మహారాష్ట్రలోని చెప్రాల ఆధ్మాత్మిక కేంద్రానికి పాదయాత్రగా భక్తులు తరలి వెళ్లారు. దత్తావతార్ కార్తీక్ మహరాజ్ సమాధి వద్ద భక్తులు పాదపూజ చేశారు. అంతకు ముందు భాజాభజంత్రీలతో పక్కనే ప్రవహిస్తున్న ప్రాణహిత నది నుంచి గంగాజలాలను తీసుకు వచ్చారు. అనంతరం ఆలయంలో జలాభిషేకం చేశారు. అనంతరం కార్తీక్ మహరాజ్ చిత్రపటంతో పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. పాదయాత్రగా వచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక కేంద్రం సందడి వాతావరణం కనిపించింది. పాదయాత్రకు పలు మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. పాదయాత్రకు వచ్చిన భక్తులకు ఆదివారం ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.