kumaram bheem asifabad- దొడ్డి కొమురయ్య చరిత్రను భావితరాలకు అందించాలి
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:10 PM
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను బావి తరాలకు అందించాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి రమాదేవి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను బావి తరాలకు అందించాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి రమాదేవి అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ తెలంగాణ సాయుద రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించారని చెప్పారు. అనాటి భూస్వాముల అగడాలను ఎదిరించి, పోరాడి ప్రజల్లో చైతన్యం తీసుకువచచ్చారన్నారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మహనీయులు అందించిన సేవలను భావి తరాలకు అందించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె అకాష్, బీజేపీ రాష్ట్ర నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ నాయకులు మల్లికార్జున్, మిషన్ భగీరథ ఈఈ సిద్దీక్ తదితరులు పాల్గొన్నారు.