Share News

kumaram bheem asifabad- హియరింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:28 PM

ఎస్‌ఐఆర్‌లో భాగంగా మ్యాపింగ్‌ కాని అనామలిస్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- హియరింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) ఎస్‌ఐఆర్‌లో భాగంగా మ్యాపింగ్‌ కాని అనామలిస్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 20 తేదీలోగా అనామలిస్‌ జాబితాలోని ఓటర్లు, మ్యాపింగ్‌ కాని ఓటర్ల హియరింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. సంబంధిత ఓటరు సమర్పించిన వివరాలను డాటా ఎంట్రి ఆపరేటర్లు ఎలాంటి పొరపాటు లేకుండా నమోదు చేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులు త్వరగ పరిష్కరించాలని సూచించారు. ఫారం-6తో డిక్లరేషన్‌ తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.

నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి..

రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం అందించి పునరావాసం కల్పించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి సోమవారంమంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ఝాజుతో కలిసి ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంలో ముంపుకు గురయ్యే భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. భూములు ఇండ్లు కొల్పోయే వారికి త్వరగా పరిహారం అందించి పునరావాసం కల్పించాలని రైతులకు మెరుగైన మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం అంచాలని తెలిపారు. భూ సేకరణ పునరావాసం ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తీసుకోవాలని అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, నీటి పారుదల శాఖ అధికారులు తిరుపతి, భద్రయ్య, రమణ, వేణుగోపాల్‌, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 10:28 PM