Share News

పెరుగుతున్న చలి...

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:28 PM

జిల్లాలో చలి పెరు గుతోంది. క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో వాతావరణం పూ ర్తిగా చల్లబడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి తీవ్రత తీవ్రం గా ఉంటుండటంతో ప్రజలు ఒకింత ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.

పెరుగుతున్న చలి...

-పడిపోతున్న ఉష్ణోగ్రతలు

-రాత్రి వేళల్లో మరింతగా అధికమవుతున్న చలి

-పొగమంచుతో వాహన చోధకుల ఇబ్బందులు

-బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న జనం

మంచిర్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలి పెరు గుతోంది. క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో వాతావరణం పూ ర్తిగా చల్లబడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి తీవ్రత తీవ్రం గా ఉంటుండటంతో ప్రజలు ఒకింత ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రా ష్ట్రస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల సరసన మంచిర్యాల చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ము ఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రరూపం దాల్చు తోంది. ఉదయం 8 గంటల దాకా చలి ప్రభావం నెలకొంటుంది. సాయంత్రం 5 దాటిందంటే చలి ఉగ్రరూపం దాల్చుతోంది. విపరీ తమైన చలి కారణంగా రోడ్లపై ఉదయం, సాయంత్రం వేళ ల్లో పొగ మంచు అలుముకుంటోంది. దీంతో వాహనాల రాకపో కలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడు ఎన్నడూ లేని విధంగా గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా క్రమేపీ సగటు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. నాలుగైదు రోజుల నుంచి ఉదయం వేళల్లో మంచు కురుస్తుండటంతో చలి ప్రభావం అధికమవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగింది. విపరీతమైన చలి కారణంగా మార్కెట్లో స్వెట్టర్లు, ఉన్ని వస్త్రాలకు గిరాకీ ఏర్పడింది.

15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు....

జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోవడం ఆందో ళన కలిగిస్తోంది. జన్నారం కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతుండటంతో జిల్లాలో చలి తీ వ్రతరం అవుతోంది. అటవీ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు న మోదవుతుండగా పొగ మంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు చలిబారిన పడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులకు వెళ్లే సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మిడిల్‌ షిఫ్ట్‌ ముగించుకొని ఇళ్లకు వెళ్లేవారు, రాత్రి షిఫ్టు సమయంలో విధులకు వెళ్లేటప్పుడు, తిరిగి ఉదయం తిరిగి వచ్చే టప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే చి న్నా రులు సైతం ఉదయం వేళ చలికి తట్టుకోలేక పోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే కూరగాయల విక్రేతలు, పాల వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు...

జిల్లాలో మూడు రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల వివ రాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన 15.1 డిగ్రీల కనిష్ట ఉ ష్ణోగ్రతలు నమోదు కాగా, 13న 21.9 డిగ్రీలు నమోదుకాగా, తా జాగా జిల్లాలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి ల్లాలోని కన్నెపల్లి మండలంలో శనివారం 15 డిగ్రీల అత్యల్ప ఉ ష్ణోగ్రతలు నమోదు కాగా, మందమర్రి, లక్షెట్టిపేట, జన్నారం మం డలం తపాల్‌పూర్‌, భీమారం మండలాల్లో 15.1 డిగ్రీలు, చెన్నూ రు మండలంలో 15.2 డిగ్రీలు, హాజీపూర్‌ మండలంలో 15.3 డి గ్రీలు, దండేపల్లి మండలం వెల్గనూరు, భీమిని మండలంలో 15.4 డిగ్రీలు, జైపూర్‌ మండలంలో 15.5 డిగ్రీలు, పాత మంచిర్యాల, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 15.7 డిగ్రీలు, నస్పూర్‌లో 15.8 డిగ్రీలు, కోటపలి,్ల తాండూరు మండలాల్లో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పొగమంచుతో ఇబ్బందులు.....

కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా ముఖ్యంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టైగర్‌ రిజ ర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని దండేపల్లి మండలంలో పొగ మంచు కా రణంగా రోడ్లు కనబడక పోవడంతో లైట్ల వెలుతురులో వాహనా లను నడాపల్సి వస్తోంది. నాలుగు రోజులుగా నమోదవుతున్న కని ష్ట ఉష్ణోగ్రతల కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం ఇలాగే ఉంటే రాబోయే నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 11:28 PM