kumaram bheem asifabad- చెప్రాలకు మహా పాదయాత్ర
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:25 PM
బెజ్జూరు మండలం ఎల్కపల్లి(బి) హనుమాన్ ఆలయం నుంచి మహారాష్ట్రలోని చెప్పాల హనుమాన్ మందిర్ ప్రశాంత్ ధాం వరకు పాదయాత్రగా భక్తులు బయలుదేరారు. 21వ మహాపాదయాత్రను పెద్దసిద్దాపూర్ సర్పంచ్ సెండె పద్మ శంకర్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ పాదయాత్ర బెజ్జూరు, కుకుడ, పోతెపల్లి, బారెగూడ, రుద్రాపూర్, చింతలమానేపల్లి, అనుకోడ, రవీంద్రనగర్ మీదుగా కొనసాగింది.
బెజ్జూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలం ఎల్కపల్లి(బి) హనుమాన్ ఆలయం నుంచి మహారాష్ట్రలోని చెప్పాల హనుమాన్ మందిర్ ప్రశాంత్ ధాం వరకు పాదయాత్రగా భక్తులు బయలుదేరారు. 21వ మహాపాదయాత్రను పెద్దసిద్దాపూర్ సర్పంచ్ సెండె పద్మ శంకర్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ పాదయాత్ర బెజ్జూరు, కుకుడ, పోతెపల్లి, బారెగూడ, రుద్రాపూర్, చింతలమానేపల్లి, అనుకోడ, రవీంద్రనగర్ మీదుగా కొనసాగింది. సుమారు 45 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సాయంత్రం ప్రశాంత ధాంకు చేరుకున్నారు. బెజ్జూరు రంగనాయక స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి, శివాలయం, ఎల్కపల్లి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా పాదయాత్ర భక్తులకు దారి పొడవున పలువురు దాతలు తేనీరు, పండ్లు పంపిణీ చేశారు. బెజ్జూరు సర్పంచ్ సరోజ, అమీరుద్దీన్ ఆధ్వర్యంలో అరటిపండ్లు పంపిణీ చేశారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు తిరుపతి, వెంకటేష్‌లు తేనీరు, బిస్కెట్లు, మాజీ ఎంపీటీసీ పర్వీన్‌సుల్తానా జావీద్‌ల ఆధ్వర్యంలో అరటిపండ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. నాగులవాయి యూత్ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. బారెగూ డ మాజీ వైస్ ఎంపీపీ రేఖ పెంటయ్యలు అల్పాహారం, కుకుడ సర్పంచ్ చిరంజీవి, తేనీరు, అరటి పండ్లు పంపిణీ చేశారు. అలాగే ప్రశాంత ధామ్‌కు చేరుకున్న భక్తులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చెప్రాడ హనుమాన్ ప్రశాంతధాంకు సాయంత్రం చేరుకున్న భక్తులతో ఎమ్మె ల్యే కలిసి కార్తీక్‌స్వామి చిత్రపటంతో ఆలయం చుట్టు ప్రదక్షణలు నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్సై మోహన్‌నాయక్, ఆలయ కమిటీ అధ్యక్షు డు మహేష్, రామకృష్ణ, నాయకులు శ్రీవర్ధన్, తిరుపతి, శ్యాంసుందర్, సుధాకర్‌గౌడ్, రమేష్, నిర్వహకులు భాస్కర్‌రాజు, జగన్‌మోహన్, శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.