kumaram bheem asifabad-కంకర తేలి.. గుంతలు పడి..
ABN , Publish Date - May 22 , 2026 | 10:14 PM
జిల్లా కేంద్రం నుంచి ఎల్లారం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్డు పూర్తిగా కంకర తేలి అధ్వాన్నంగా మారింది. రోడ్డు మరమ్మతు పనులు ఆలస్యం కారణం గా ప్రజలు అవస్థలు పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ పనులను సకాలంలో పూర్తి చేయకుండా వదిలేయడంతో గ్రామస్థు లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించేందు కు సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదు. 2
- రాకపోకలకు వాహనదారుల అవస్థలు
- మరమ్మతులపై అధికారులకు పట్టింపు కరువు
ఆసిఫాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం నుంచి ఎల్లారం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్డు పూర్తిగా కంకర తేలి అధ్వాన్నంగా మారింది. రోడ్డు మరమ్మతు పనులు ఆలస్యం కారణం గా ప్రజలు అవస్థలు పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ పనులను సకాలంలో పూర్తి చేయకుండా వదిలేయడంతో గ్రామస్థు లు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించేందు కు సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదు. 2018లో రోడ్డు నిర్మాణం, మరమ్మతు లకుగాను 40 లక్షల నిధులు మంజూరు కాగా సంబంధిత కాంట్రాక్టర్ కొంత దూరం కంకర పోసి పనులను పూర్తి చేయకుండా వదిలి వేశారు. ఎల్లారం, కంచర్‌గూడ గ్రామాల ప్రజలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాని కి ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుం టారు. కంకర తేలి ఉన్న ఈ రోడ్డు పై వెళ్లాలంటే నిత్యం నరకయాతన పడుతు న్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులైతే ఎదో ఓకచోట పడి గాయాలపాలవుతున్నారని గ్రామస్థులు వాపో తున్నారు. ఈ రోడ్డు దెబ్బ తినడంతో గ్రామానికి వెళ్లేందుకు తీవ్ర అవ స్థలు పడుతు న్నామని చెబుతున్నారు. ప్రతి రోజు జిల్లా కేంద్రానికి పాఠశాలలు, కళాశా లలకు వెళ్లే విద్యార్థులు ఈ రోడ్డు వెంట అతి కష్టంగా రాకపోకలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతు న్నారు. అధికారులు పట్టించుకోకుంటే కలెక్టరే ట్ ఎదుట ఆందోళన చేపడుతామని గ్రామ స్తులు చెబుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
చటారే కారు. ఎల్లారం గ్రామస్థుడు
రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బం దులు పడుతున్నాం. ప్రతి చిన్న అవసరానికి నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు కంకర తేలి గుంతల మయంగా మారడంతో వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. అధికారులు స్పందించి రో డ్డు నిర్మాణ పనులు చేపట్టాలి.
ప్రమాదాలకు గురవుతున్నారు..
చౌదరి గంగారాం, వార్డు సభ్యుడు ఎల్లారం
ఆసిఫాబాద్ నుంచి ఎల్లా రం వరకు రోడ్డు కంకర తేలి గుంతలమయమై వాహన దారు లు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహ నంపై నుంచి పడి పోవడంతో కాలు విరిగిం ది. అధికారులు చర్యలు తీసుకోవాలి.