వైభవంగా సత్యదేవుడి రథోత్సవం
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:29 PM
మండలం గూడెం శ్రీసత్యనారాయ ణస్వామి దేవస్ధానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆనందోత్సవాల మ ధ్య ముగిసాయి. స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం తెల్ల వారుజామున సత్యదేవుడి ప్రధానాలయంలో స్వామి వారి రథోత్సవ వేడుక లను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ముగిసిన స్వామి వారి బ్రహ్మోత్సవాలు
దండేపల్లి ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలం గూడెం శ్రీసత్యనారాయ ణస్వామి దేవస్ధానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆనందోత్సవాల మ ధ్య ముగిసాయి. స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం తెల్ల వారుజామున సత్యదేవుడి ప్రధానాలయంలో స్వామి వారి రథోత్సవ వేడుక లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు ఆలయ వ్య వస్థాపక కుటుంబసభ్యులు గోవర్ధన రఘస్వామి, సంపత్‌స్వామి, ఆలయ అ ర్చకులు, వేద పండితులు దుద్దిళ్ల నారాయణశర్మ, భరత్‌శర్మలు వేదమంత్రో చ్ఛారణతో పూజలు చేసి రథోత్సవం ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాలతో స త్యదేవుని ప్రధానాలయం చుట్టూ తిరిగారు. రంగులు చల్లుకుంటు నృత్యా లు చేశారు. ఉదయం 10 గంటలకు సప్తాహ భజన కార్యక్రమం పరిసమా ప్తం, అనంతరం ఆలయంలో రాత్రి 7గంటలకు స్వామివారికి పుష్ఫాభిషేకం తో సత్యదేవునికి ఏకాంత సేవతో 8వ రోజుతో శ్రీస్వామి వారి బ్రహ్మో త్సవా ల వేడుకలు అంగరంగ వైభవంగా ముగిస్తాయి. కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ శ్రీనివాస్‌గౌడ్, ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బం ది, భజన కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.