ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 17 , 2026 | 11:17 PM
వరిధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చే యాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, మే 17 (ఆంధ్రజ్యోతి) : వరిధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చే యాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ఆదివా రం హాజీపూర్ మండలంలోని గుడిపేట, నంనూర్, దొన బండ, లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోటలోని వరిధా న్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రి యను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కు ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ సౌకర్యం క ల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూ డద న్నా రు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం గా రైసుమిల్లులకు, గోదాములకు తరలించాలన్నారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లి, లక్ష్మీ పూర్‌లోని రైసుమిల్లులను తహసీల్దార్ దిలీప్ కుమార్‌తో కలిసి సందర్శించారు. రైసుమిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని జాగ్రత్తగా దిగుమతి చేసుకోవాలన్నారు. ఒక రోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకో వాలన్నారు. రైసు మిల్లుల యాజమానులు ధా న్యం దిగుమతి ప్రక్రియను వేగవంతంగా చేప ట్టాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్‌లు, మందుల నిల్వలు, రిజిష్టర్ లను, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చా లన్నారు. వేసవి అయినందున వడదెబ్బకు గు రి కాకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజల కు వివరించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమ య పాలన పాటించాలన్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అధికారులు, వైద్యులు ఉన్నారు.