ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 06 , 2026 | 11:48 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మే 6 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో గోదాములను తక్ష ణమే ప్రారంభించి ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని నిల్వ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు పది రైసుమిల్లులు పనిచేస్తున్నాయని, సుముఖ్ గోదాం సామ్ద్యం 20 వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇతర గోదాము ల సామర్థ్యం 61 వేల మెట్రిక్ టన్నులుగా ఉందన్నారు. ఈ సామర్థాన్ని పూ ర్తిగా వినియోగిస్తూ నిల్వలను సమర్ధవంతగా నిర్వహించాలన్నారు. మిల్లల బ్యాంక్ గ్యారంటీలను సమీక్షించి అర్హత ఉన్న మిల్లులకు ధాన్యం విడుదల చేయాలన్నారు. గోనె సంచుల కొరత ఎక్కడా లేకుండా చూడాలన్నారు. కొను గోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాల న్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకళ, అధికారులు, రవాణా గుత్తేదారులు పాల్గొన్నారు.