ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి
ABN , Publish Date - May 31 , 2026 | 11:40 PM
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, మే 31 (ఆంధ్రజ్యోతి) : వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఓత్కులపల్లి, ఆస్నాద్, సోమనపల్లి గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, చెన్నూరులోని గోదాములను మండల తహసీ ల్దార్ మల్లికార్జున్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొని మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కొనుగోలు ప్రక్రియలు ఎలాంటి అవాంత రాలు లేకుండా పారదర్శకంగా వేగంగా నిర్వహించాలన తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందించాలన్నారు. ధాన్యం తరలింపు, నిల్వలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.