Share News

ప్రభుత్వ వైఖరి ప్రజలకు చెప్పాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:51 PM

కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ పథకాలపై ప్రభు త్వ వైఖరి ఏంటో ప్ర జలకు చెప్పాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌ భీమా అన్నారు.

ప్రభుత్వ వైఖరి ప్రజలకు చెప్పాలి
అచ్చంపేట అంబేడ్కర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌ భీమా

అచ్చంపేటటౌన్‌, ఆ గస్టు 18 (ఆంధ్రజ్యోతి) : కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ పథకాలపై ప్రభు త్వ వైఖరి ఏంటో ప్ర జలకు చెప్పాలని బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌ భీమా అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యం లో కల్యాణలక్ష్మి, షాదీ ము బారక్‌ పథకాలను కొనసా గించాలని కోరుతూ బీఆర్‌ ఎస్‌ సీనియర్‌ నాయకుడు పోకల మనోహర్‌ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేడ్క ర్‌ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. అనం తరం ఆర్డీవో యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం తీసుకువచ్చిన పథకం ఈ రోజు కనుమ రుగయ్యే ప్రమాదముందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథ కంపై హైకోర్టులో కేసును సవాల్‌ చేస్తూ ప్ర భుత్వం ఇప్పటివరకు ఎలాంటి పిటిషన్‌ దాఖ లు వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ పథకాలను యాథావిధిగా కొనసాగించి పేద కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వా న్ని కోరారు. కార్యక్రమంలో మాజీ మునిసిపల్‌ చైర్మన్లు తులసీరాం, నర్సింహ్మగౌడ్‌, నాయ కులు కర్ణాకర్‌రావు, అంతటి శివ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:51 PM