ప్రజలకు పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 29 , 2026 | 11:16 PM
ప్రజల కు మరింత మెరుగైన, పారదర్శకమైన పరిపా లన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ల క్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నా రు.
తాడూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజల కు మరింత మెరుగైన, పారదర్శకమైన పరిపా లన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ల క్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నా రు. తాడూరులో నూతన తహసీల్దార్ కార్యాల య భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు. మండల కేం ద్రంలోని సర్వే నెంబరు 644లో ఉన్న ఎకరం ప్ర భుత్వ భూమిని పరిశీలించారు. కార్యాలయ ని ర్మాణానికి అనుకూలత, రవాణా సౌకర్యం, భవి ష్యత్తు విస్తరణ అవకాశాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. కలెక్టర్ మా ట్లాడుతూ మండలం ప్రజలకు అన్ని రెవెన్యూ సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా కా ర్యాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ ఆర్ ప్రక్రియ గురించి కలెక్టర్ ఆరా తీయగా, మండలంలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వం దశాతం పూర్తైందని తహసీ ల్దార్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం తాడూరులో నిర్మా ణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సంద ర్శించి లబ్దిదారులతో మాట్లాడారు. అక్కడి నుం చి మండల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శిం చారు. అక్కడి విద్యా బోధన, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, నమోదు వివరాలు, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమిక దశలోనే వి ద్యార్థులకు బలమైన పునాది ఏర్పడేలా బోధన ఉండాలని సూచించారు. మండల పరిధిలోని గుంత కోడూరు గ్రామంలో రైతు చంద్రయ్యకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో సుమారు 15.15 చదరపు పరిమాణంలో నిర్మిస్తున్న ఫాంపాండ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. వీబీజీరాంజీ పథకం ద్వారా రైతులకు వ్యవసాయానికి అను బంధంగా అదనపు ఆదాయ వనరులు కల్పిం చాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. కూలీల సంక్షేమానికి ప్రాధాన్య తనివ్వా లని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమా ల్లో తహసీల్దార్ రామకృష్ణయ్య, ఎంపీడీవో శో భారాణి, హౌసింగ్ ఏఈ హన్మంతు, తాడూరు సర్పంచు మల్లయ్య, అధికారులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.
రైతు అవగాహన సదస్సులో కలెక్టర్
తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని దాసుపల్లి గ్రామం రైతు వేదికలో సీడ్స్‌ఫామ్, డెయిరీ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించిన రైతుల అవగాహన సదస్సు లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొన్నా రు. ఆయన మాట్లాడుతూ రైతులకు పాడి పశువుల గురించి అవగాహన కల్పించడం వల్ల వారు అధిక లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్ర మంలో సీడ్స్ ఫామ్ ఫౌండర్ ఎండీ డాక్టర్ కిషోర్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఏఆర్‌ఐ జీపీవో అగ్రికల్చర్ ఏవో నర్మద, వెటర్నర్ డాక్టర్స్, ఎంఈడీవో వెంకట్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, రైతు సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.