పేదల కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:43 PM
పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం అనుపురం, పట్టణంలోని లాల పల్లి గ్రామాల్లో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి
వేములవాడ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం అనుపురం, పట్టణంలోని లాల పల్లి గ్రామాల్లో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్ర్తాలను అంద జేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంది రమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయని, రాష్ట్రంలో సామూహికంగా అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గృహప్రవేశ కార్యక్రమానికి హజరయ్యారని తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలో...
సిరిసిల్ల టౌన్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని 3, 20వ వార్డులలో సోమవారం ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయి. గృహ ప్రవేశ కార్యక్రమా లకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్ర వాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి పాల్గొని గృహ ప్రవేశాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్‌పాషా, హౌసిం గ్ పీడీ, కౌన్సిలర్‌లు సాగల హరిప్ర సాద్, కూరపాటి శ్రీశైలం, కో అప్షన్ సభ్యుడు నంది శంకర్, ఎమ్మార్వో మహేష్‌కుమార్, ఇందిరమ్మ ఇంటి యజమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.