Share News

రైతులకు ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 05 , 2026 | 11:31 PM

రైతులకు ఆదాయం పెం చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్య మని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

రైతులకు ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
స్టాళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

కందనూలు,మే5 (ఆంధ్రజ్యో తి) : రైతులకు ఆదాయం పెం చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్య మని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లోని వైభవ్‌ గా ర్డెన్‌లో 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యానవన పంట సాగు ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణంపై రైతు లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఆదాయం పెంచడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కర్తవ్య మని ఆయన అన్నారు. రైతులు ప్రత్నామ్నాయ పంటలో ప్రోత్సాహంపై హార్టికల్చర్‌ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రతీ వర్గానికి మేలు : ఎమ్మెల్యే

రాష్ట్రంలో ప్రతీ వర్గానికి మేలు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని నాగర్‌క ర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో మంగళవారం బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు షా దీముబారక్‌, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లను ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. ఆయా కార్యక్రమా ల్లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, ము నిసిపల్‌ చైర్మన్‌ తీగల సునీంద్ర, రైతులు, బిజినే పల్లి, తిమ్మాజిపేట కాంగ్రెస్‌ పార్టీ మండల అ ధ్యక్షులు విద్యా రాములు, వివేక్‌రెడ్డి, జిల్లా ప్ర ధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హార్టికల్చర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 11:31 PM