సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:51 PM
పేద కుటుంబాలకు సొంతింటి కళను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నామని, అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.
ఎంపీ వంశీకృష్ణ
కోటపల్లి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి) : పేద కుటుంబాలకు సొంతింటి కళను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నామని, అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం మండలంలోని రాజారం, కోటపల్లి, తదితర గ్రామాల్లో ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టిన కుటుంబీకులతో కలిసి ఆయన సంతోషాన్ని పంచుకున్నారు. ఇంటి యాజమానులను అభినందిస్తూ కొత్త గృహాల్లోఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సొంతింటి కల నెరవేరినప్పుడు ఆ కుటుంబాల్లో కనిపించే ఆనందమే తమకు సంతోషాన్ని ఇస్తుందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పిన్నారం గ్రామంలో తాగునీటి సమస్య నెలకొందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే సమస్యను పరిష్కరిస్తామని బోర్‌వెల్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ముందుంటుందని, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ,ప్రజలు పాల్గొన్నారు.