Share News

మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 29 , 2026 | 11:28 PM

మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కలెక్టర్‌ సమా వేశ మందిరంలో నిర్వహించిన మహిళ వారోత్సవాల్లో అదపు కలెక్ట ర్‌ చంద్రయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మేయర్‌ ధర్ని మధుకర్‌తోలకలిసి పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కలెక్టర్‌ సమా వేశ మందిరంలో నిర్వహించిన మహిళ వారోత్సవాల్లో అదపు కలెక్ట ర్‌ చంద్రయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మేయర్‌ ధర్ని మధుకర్‌తోలకలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మ హిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణలు అందిస్తూ వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు. మొత్తం 1210 స్వయం సహాయక సంఘాలకు 53కోట్ల10లక్షల75 వేల రూపాయలను తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడం ఇస్తారన్నారు. ఎమ్మెల్యే ప్రేంసా గర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిర మహిళ శక్తి ద్వారా లబ్ది పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలు వారి ఆర్జించిన లాభాల నుంచి కొంత శాతం సంఘాల ఖాతాల్లో పొదుపు చేయాలని, ప్రతి ఒక్కరికి సమాన లాభం చేకూర్చడమే ప్రభుత్వ ఉ ద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్‌, ఏపీఎంలు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:28 PM